చలిస్తున్న విశాఖ | Temperatures Down In Visakhapatnam | Sakshi
Sakshi News home page

చలిస్తున్న విశాఖ

Published Tue, Nov 27 2018 12:52 PM | Last Updated on Thu, Jan 3 2019 12:14 PM

Temperatures Down In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో కెల్లా విశాఖలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. గడచిన వారం రోజులను పరిశీలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీలు తక్కువకు పడిపోయాయి. ఈ నెల 19న నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు నమోదు కాగా సోమవారం 16 డిగ్రీలకు పడిపోయింది. ఇది సాధారణంకంటే ఐదు డిగ్రీలు తక్కువ. మరోవైపు విశాఖ ఏజెన్సీలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement