సాక్షి, విశాఖపట్టణం: విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. లంబసింగిలో 11, చింతపల్లిలో 13 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట మొత్తం మంచుతో కప్పబడి ఉన్నట్లుగా ఉంటోంది. అంతేగాక మధ్యాహ్నం 12 గంటలు అయినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది.
అయితే... అక్టోబర్ చివరి వారంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. ప్రతి ఏడాది నవంబర్ చివరి వారం, డిసెంబర్, జనవరిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఈ ఏడాది ముందుగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి పులి చంపేసేటట్లుగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment