ఈ రోజుల్లో చాలామందికి మద్యం అలవాటు ఉంది. మద్యాన్ని చాలామంది చల్లగా తాగేందుకు లేదా, ఐస్ ముక్కలు వేసుకుని తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా అది ఎందుకు గడ్డకట్టదో మీకు తెలుసా? దీనికి వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సంగతి తెలుసుకునేముందు ఏ ద్రవ పదార్థమైనా ఏ విదంగా గడ్డ కడుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ లిక్విడ్‌లోనూ దాని అంతర్గత ఉష్ణోగ్రత ఉంటుంది. అది దాని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అది ఉన్న వాతావరణంలోని ఉష్ణోగ్రత తగ్గితే దానిలోని అణువులు ఒకదానికొకటి మరింత దగ్గరవుతాయి. ఫలితంగా ద్రవ పదార్థం గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది.
ద్రవ పదార్థం గడ్డకట్టడమనేది వివిధ కారణాలపై ఆధారపడివుంటుంది. మద్యంలో ఉండే ఆర్గానిక్ మాలిక్యూల్స్ దానిని గడ్డకట్టనీయకుండా చేస్తాయి. ద్రవపదార్థం గడ్డకట్టడం అనేది దాని ఘనీభవనస్థానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ పదార్థానికి దాని ఘనీభవన స్థానం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నీటినే తీసుకుంటే అది జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఘనీభవిస్తుంది. అంటే నీటి ఘనీభవన స్థానం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్.
మద్యం విషయానికొస్తే దాని ఘనీభవన స్థానం 114 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ కారణం చేతనే మద్యం గడ్డ కట్టాలంటే 114 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. మన ఇళ్లలో ఉండో ఫ్రిజ్‌లలో 0 నుంచి -10 లేదా అత్యధిక ఉష్ణోగ్రత -30 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా ఉంటుంది. అందుకే మద్యాన్ని ఇంటిలోని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా గడ్డకట్టదు.
ఇది కూడా చదవండి: తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే..
Comments
Please login to add a commentAdd a comment