
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలుగు రాష్ర్టాల్లో బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో ఎండ విపరీతంగా పెరిగిపోతోంది. అప్పుడే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. ఉదయం 11 గంటలకే జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికే జనాలు జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదు కాగా కనిష్టంగా విశాఖపట్నంలో 31 డిగ్రీలు నమోదయ్యింది. తెలంగాణలో ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36 డిగ్రీలు నమోదయ్యింది.