మంచు హోటల్: ఎండాకాలంలో కూడా కరగదట | Sweden: World First Ice Hotel That Does Not Melt Even In Summer | Sakshi
Sakshi News home page

ఐస్‌ హోటల్.. అదుర్స్‌‌ !!

Published Sun, Mar 7 2021 11:04 AM | Last Updated on Sun, Mar 7 2021 3:03 PM

Sweden: World First Ice Hotel That Does Not Melt Even In Summer - Sakshi

ఎంత పెద్ద ఐసు గడ్డ అయినా రెండు నిమిషాలు ఎండలో పెడితే కరగడం మొదలు పెడుతుంది. అటువంటిది ఐస్‌తో నిర్మించిన ఓ హోటల్‌ ఎండాకాలంలో కూడా కరగదట. ఏ సీజన్‌లోనైనా ఈ ఐస్‌ హోటల్‌ పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తుందని హోటల్‌ యాజమాన్యం చెబుతోంది. ఎండలో కూడా కరగని చిత్రమైన హోటల్‌ ఉత్తర స్వీడన్‌లోని జకాస్‌జర్వీ అనే గ్రామంలో ఉంది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్‌లో అనేక మంచు కళా ఖండాలతో ఆకర్షణీయమైన డిలక్స్‌ సూట్‌లు ఉన్నాయి.  

హోటల్‌ మొత్తాన్నీ స్టీల్, కాంక్రీట్‌తో నిర్మించారు. పై కప్పును 20 సెంటీమీటర్ల ఇన్సులేషన్‌తో నిర్మించడం వల్ల ఎండాకాలం లో కూడా హోటల్‌ కరగదు. ఇన్నీ హంగులున్న ఈ హోటల్‌ పేరు ‘ఐస్‌ హోటల్‌ 365’ పేరుకు తగ్గట్టుగానే ఇది సంవత్సరం మొత్తం పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ హోటల్‌లో ఎంతో సౌకర్యవంతమైన బెడ్స్, టాయిలెట్స్‌ ఉన్నాయి. మొత్తం తొమ్మిది రకాల డిలక్స్‌ రూంలను మూడు పద్దతుల్లో అందుబాటులో ఉంచుతారు. స్వీడన్‌లోని కిరుణ ఎయిర్‌పోర్టు నుంచి ఈ హోటల్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతిఏటా ఈ హోటల్‌ను 50 నుంచి 60 వేలమంది వరకు సందర్శిస్తుంటారు. ఐస్‌ తో తయారు చేసిన ఈ హోటల్‌ 2016 నవంబర్‌ నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement