రికార్డు స్థాయిలో కరుగుతున్న మంచు
వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్ ప్రభావమో ఏమోకానీ ఇరు ధ్రువాల వద్ద మంచు రికార్డు స్థాయిలో మంచు కరుగుతోంది. అర్కిటిక్ వద్ద ఈ ఏడాది చలికాలంలో మంచు రికార్డుస్థాయిలో తక్కువస్థాయిలో ఉండగా, ఇక అంటార్కిటిక్ ధ్రువం వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 1979 నుంచి ఉపగ్రహాలు ఈ రెండు ధ్రువాల వద్ద సముద్రహిమస్థాయిని నిరంతరాయంగా అంచనా వేస్తుండగా ఈ ఏడాది అత్యంత తక్కువగా ఉన్నట్టు తేలింది.
ప్రస్తుతం 16.21 కి.మీ విస్తీర్ణంలో ధ్రువాల వద్ద సముద్రహిమం వ్యాపించి ఉంది. 1981–2010 మధ్యకాలం నాటితో పోలిస్తే ఇది రెండు మిలియన్ చదరపు కి.మీ కంటే ఇది తక్కువ. సముద్రహిమం మెక్సికో కంటే పెద్దదైన సముద్రహిమభాగం కరిగిపోయినట్టు తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్... అంటార్కిటికా ధ్రువాన్ని సైతం కబళించివేస్తోందని నాసాకు చెందిన వాల్ట్ మీయర్ పేర్కొన్నారు. మార్చి రెండో వారం నుంచి సెప్టెంబర్ రెండోవా రం మధ్యకాలంలో ఆర్కిటిక్ సముద్రంతోపాటు దానికి సమీపంలోని సముద్రాలపై ప్రవహించే హిమం మరింత కిందికిదిగిపోతూ ఉంటుంది.