చైనాలో ప్రతి డిసెంబర్‌లో జరిగే ‘హర్బిన్ ఇంటర్నేషనల్ ఐస్ అండ్ స్నో స్కల్పప్చర్ ఫెస్టివల్’కు భారీగా పర్యాటకులు వస్తారు. కారణం ఏమిటంటే అక్కడ ప్రవహించే సొంగువా నది నవంబర్ నుంచి మార్చి వరకు గడ్డ కట్టి΄ోతుంది.హర్బిన్ నగరానికి దాపుగా ఈ నది ఉండటంతో నది ఉపరితలం మీద ఉన్న ఐస్‌ను కోసి వ్యా΄ారులు అమ్ముతారు. శిల్పులు ఆ ఐస్ కొని భారీ విగ్రహాలు చేసి ప్రదర్శనకు పెడతారు.
ఇలా మంచు శిల్పాలు, ఆకారాలు, మంచుతో కట్టిన భవనాలు ఇవన్నీ కలిసి ‘హర్బిన్ ఐస్ ఫెస్టివల్’ పేరుతో జరుగుతాయి. ఈశాన్య చైనాలో ఉండే హర్బిన్ నగరం సైబీరియా మంచు ఎడారికి దగ్గర. నవంబర్ నుంచి సైబీరియా మంచు గాలులు మొదలయ్యి చలి పెరుగుతుంది. నది గడ్డ కడుతుంది. డిసెంబర్‌లో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 16 డిగ్రీల వరకూ ఉంటాయి. అందుకే ఈ చలిలో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎంతకీ కరగని మంచుతో ఇలా ఉత్సవం చేసి ఆనందిస్తారు. మీ దగ్గర హుండీలో దాచిన డబ్బు ఉంటే వెళ్లి చూసి రండేం!
Comments
Please login to add a commentAdd a comment