పాలిచ్చిన తండ్రులు
హర్భిన్: చిన్న పిల్లల తండ్రులు 'మదర్స్ డే' సందర్బంగా తల్లిపాల ప్రాముఖ్యతను వినూత్నరీతిలో తెలిపారు. చైనాలోని హర్భిన్ సిటీలో పిల్లలున్న కొందరు పురుషులు ఒకే చోట చేరి బొమ్మలకు పాలు ఇచ్చారు. పురుషులు షర్టు విప్పి చేతిలో బొమ్మలను పట్టు కొని అచ్చం తల్లి పాలు ఇస్తున్నట్టు అనుకరించారు.
'మదర్స్ డే' సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తెలపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పని ఒత్తిడితో చైనాలోని పట్టణాల్లో తల్లి పాలు ఇచ్చేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా సగటున తల్లి పాలిస్తున్న వారు 40 శాతంగా ఉంటే.. 2014 అధికారిక నివేదిక ప్రకారం చైనాలోని పట్టణాల్లో 6 నెలలలోపు పిల్లలకు తల్లిపాలిస్తున్న వారు కేవలం 16 శాతం మాత్రమే ఉన్నారు. దీంతో తల్లి పాలతో పిల్లల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని తండ్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.