గడ్డకట్టిన మంచుతో శిల్పాలు చెక్కి ప్రదర్శనకు పెట్టడం చలి ప్రదేశాల్లో మామూలే! స్వీడన్‌లోనైతే ఏకంగా గడ్డకట్టిన మంచుతో ఒక భారీ హోటల్‌నే నిర్మించారు. ఇందులోని మంచాలు, కుర్చీలు, బల్లలు వంటివన్నీ గడ్డకట్టిన మంచుతో తయారు చేసినవే కావడం విశేషం.
జేమ్స్‌బాండ్ సినిమా ‘డై ఎనదర్ డే’లో కనిపించిన భవంతి నమూనా ఆధారంగా ఈ హోటల్‌ను నిర్మించడం విశేషం. టోర్నె నదిలో గడ్డ కట్టిన మంచును తవ్వి తెచ్చి, నదికి సమీపంలోనే దీనిని ఐదువందల టన్నుల మంచుతో నిర్మించారు. ఇందులో పన్నెండు ఆర్ట్ స్వీట్‌రూమ్స్, ఒక డీలక్స్ స్వీట్‌రూమ్, థీమ్డ్ రూమ్‌లు, బార్ సహా పలు వసతులు ఉన్నాయి.
ఈ హోటల్‌లో పది ఒలింపిక్ స్విమింగ్ పూల్స్, ముప్పయిమూడు చిన్న స్విమింగ్‌పూల్స్ కూడా ఉన్నాయి. లూకా రోంకొరోని నేతృత్వంలో ఇరవై నాలుగు మంది హిమశిల్పులు దీనిని నిర్మించారు. దీని లోపలి భాగంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అతిథులకు అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment