విలియం రీడ్ మీడియా ఈ ఏడాది 2024కి ప్రంపంచలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అందుకోసం రెస్టారెంట్ల జాబితాను మరింతగా సవరించింది. ఈ గ్లోబల్ ర్యాకింగ్స్‌ని సవరించి 2024కి సంబంధించిన ప్రతిష్టాత్మక ఉత్తమ రెస్టారెంట్ల జాబితాను చేసింది. అందులో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఈ రెండు రెస్టారెంట్‌లు టాప్ 51 నుంచి 100వ ర్యాంకుల్లో స్థానాలు దక్కించుకున్నాయి.
ఈ సవరించిన జాబితాలో ముంబైలోని రెండు భారతీయ రెస్టారెంట్లలలో న్యూఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌కి స్థానం దక్కింది. ముంబైలోని మాస్క్ అనే రెస్టారెంట్ ఈ అంతర్జాతీయ జాబితాలో 78వ స్థానం దక్కించుకోగా న్యూఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చి..89వ స్థానంలో నిలిచింది.
మాస్క్ రెస్టారెంట్..
ఆసియాలోని 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితా ప్రకారం 2023-2024లో భారతదేశంలోని ది బెస్ట్ రెస్టారెంట్‌గా మాస్క్ నిలిచింది. ఈ రెస్టారెంట్ ఫౌండర్ అదితి దుగర్, హెడ్ చెఫ్ వరణ్ టోట్లని సారథ్యంలో కస్టమర్లకు మంచి బ్రాండెడ్ ఉత్పత్తులతో చేసిన రుచులను అందించేవారు. అంతేగాదు అందుబాటులో ఉన్న పదర్థాలతోనే మంచి రుచిని అందించేలా ఆకరషణీయంగా కనిపించేలా సర్వ్ చేస్తుంది.
ఇండియన్ యాక్సెంట్, న్యూఢిల్లీ
ఇది 2015 నుండి 2021 వరకు వరుసగా ఏడేళ్లు అత్యుత్తమ రెస్టారెంట్ ప్రకటించబడింది. ఇది 2024కి ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్‌లలో 26వ స్థానంలో ఉంది.ఇది భారతీయ సమాకాలీన వంటకాలను అందించే రెస్టారెంట్‌గా పేరుగాంచింది. చెఫ్ మనీష్ మెహ్రోత్రా సారథ్యంలో రకరకాల రుచుల ఆవిష్కరణల తోపాటు సీజన్‌కు తగ్గట్టు భారతీయ సంప్రదాయ వంటకాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది. కాగా, జూన్ 5, 2024న లాస్ వెగాస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ఈ ఏడాది 2024కి సంబంధించిన 50 అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితాను లైవ్‌లో ప్రకటించనుంది.
(చదవండి: నటుడు వరుణ్ సూద్‌కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?)
a
Comments
Please login to add a commentAdd a comment