యూకే ఆధారిత విలియం రీడ్ బిజనెస్ మీడియా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను విడుదల చేయనుంది. అందుకోసం మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికాకు సంబంధించి సుమారు 50 బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీలను ఆహ్వానించింది. వాటిలో 51 నుంచి 100 ర్యాంకుల వరకు ఆసియాకి సంబంధించిన వివిధ రెస్టారెంట్లే ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఐదు భారతీయ సంస్థలు ఉండటం విశేషం.
ఈ ఏడాదికి సంబంధించిన ఆసియా టాప్ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఈ నెలాఖరులోగా వెల్లడించనుంది. ఈ జాబితా ఎంట్రీల్లో 51-100 ర్యాంకుల్లో మూడు ముంబై రెస్లారెంట్లు, డిల్లీకి సంబంధించిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. ముంబైలోని అమెరికాలనో(61), ది బాంబే క్యాంటీన్(70), ఎకా(98), ఇక ఢిల్లీకి సంబంధించి గురుగ్రామ్‌లో కొమెరిన్(79), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (87)వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితా ఎంట్రీలో దేశం వెలుపల ఉన్న రెస్టారెంట్లు, బ్యాంకాక్‌కి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు తర్వాత స్థానంలో ఉన్నాయి.
దీనికి భారతీయ చెఫ్ గరిమా అరోరా నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ ఎంట్రీల జాబితాలో టోక్యో, సింగపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 51 నుంచి 100 ర్యాంకుల జాబితాలో మాత్రం ఆసియాలోని 16 నగరాలకి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ల 2024 జాబితాన మార్చి 26, 2024న దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగే అవార్డుల కార్యక్రమంలో వెల్లడించనున్నారు. ఈ బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీల జాబితాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. కాగా, గతేడాదిలో ఈ బెస్ట్ రెస్టారెంట్ జాబితాలో అమెరికానో 66వ స్థానాన్ని, ఎకా 93వ స్థానాన్ని దక్కించుకుంది.
(చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment