Featured
-
ఆసియాలోని బెస్ట్ రెస్లారెంట్లుగా ఐదు భారత రెస్టారెంట్లు!
యూకే ఆధారిత విలియం రీడ్ బిజనెస్ మీడియా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను విడుదల చేయనుంది. అందుకోసం మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికాకు సంబంధించి సుమారు 50 బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీలను ఆహ్వానించింది. వాటిలో 51 నుంచి 100 ర్యాంకుల వరకు ఆసియాకి సంబంధించిన వివిధ రెస్టారెంట్లే ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఐదు భారతీయ సంస్థలు ఉండటం విశేషం. ఈ ఏడాదికి సంబంధించిన ఆసియా టాప్ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఈ నెలాఖరులోగా వెల్లడించనుంది. ఈ జాబితా ఎంట్రీల్లో 51-100 ర్యాంకుల్లో మూడు ముంబై రెస్లారెంట్లు, డిల్లీకి సంబంధించిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. ముంబైలోని అమెరికాలనో(61), ది బాంబే క్యాంటీన్(70), ఎకా(98), ఇక ఢిల్లీకి సంబంధించి గురుగ్రామ్‌లో కొమెరిన్(79), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (87)వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితా ఎంట్రీలో దేశం వెలుపల ఉన్న రెస్టారెంట్లు, బ్యాంకాక్‌కి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు తర్వాత స్థానంలో ఉన్నాయి. దీనికి భారతీయ చెఫ్ గరిమా అరోరా నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ ఎంట్రీల జాబితాలో టోక్యో, సింగపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 51 నుంచి 100 ర్యాంకుల జాబితాలో మాత్రం ఆసియాలోని 16 నగరాలకి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ల 2024 జాబితాన మార్చి 26, 2024న దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగే అవార్డుల కార్యక్రమంలో వెల్లడించనున్నారు. ఈ బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీల జాబితాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. కాగా, గతేడాదిలో ఈ బెస్ట్ రెస్టారెంట్ జాబితాలో అమెరికానో 66వ స్థానాన్ని, ఎకా 93వ స్థానాన్ని దక్కించుకుంది. View this post on Instagram A post shared by The Worlds 50 Best Restaurants (@theworlds50best) (చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..) -
పాత ఫోన్ లలోనూ ‘పానిక్’ బటన్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం వాడకంలో ఉన్న ప్రతి మొబైల్ హ్యాండ్సెట్లోనూ పానిక్ బటన్ లాంటి ఫీచర్‌ను పొందుపరచాలని మొబైల్ తయారీ కంపెనీలను డాట్ ఆదేశించింది. పాత ఫోన్లలో పానిక్ బటన్ ఫీచర్‌ను అమర్చడం కోసం కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ నిమిత్తం రిటైల్ ఔట్‌లెట్స్‌లో ప్రత్యేకమైన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. పానిక్ బటన్ అంటే.. ఫోన్ వినియోగదారుడు ఏదైనా అత్యవసర సమయాల్లో అతని ఫోన్లోని 5 లేదా 9 బటన్‌ను నొక్కితే.. అప్పుడు ఆ ఫోన్ నుంచి ప్రభుత్వ విభాగాలకు ఒక కాల్ (112 నెంబర్‌కు) వెళుతుంది. అప్పుడు ఆయా విభాగాలు వెంటనే స్పందించి.. మొబైల్ వినియోగదారునికి సాయం అందిస్తాయి. వచ్చే ఏడాది (2017) జనవరి 1 నుంచి విక్రయించే అన్ని ఫోన్లలోనూ ఈ పానిక్ బటన్ ఉండాలని డాట్ ఇప్పటికే మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది. నిర్భయ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంది. -
ఎలిజబెత్ కు ఎయిర్ ఇండియా స్మారక ఆల్బమ్!
లండన్: క్వీన్ ఎలిజబెత్ 90వ పుట్టినరోజు వేడుకలకు గుర్తుగా ఎయిర్ ఇండియా ఓ అధికారిక స్మారక ఆల్బమ్ ను వెలువరించనుంది. ప్రచురణకర్త సెయింట్ జేమ్స్ హౌస్ ద్వారా ఆల్బమ్.. ఈ వారం విడుదల కానుంది. లండన్ లోని విండర్స్ కాసిల్ హోం పార్క్ లో మే 12-15 మధ్య జరిగే రాయల్ ఈవెంట్స్ సందర్భంలో పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. క్వీన్ ఎలిజబెత్ రాచరికపు జీవితంపై లండన్ లో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో కామన్వెల్త్, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆమె అంకితమైన తీరు, సాయుధ దళాలపై సారించిన దృష్టి, గుర్రాలపై చూపించిన ప్రేమ తదితర విషయాలు ప్రముఖంగా ఉంటాయని తెలుస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీలకు స్మారక ఆల్బమ్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సెయింట్ జేమ్స్ హౌస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ ఫ్రీడ్ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ ప్రముఖులు, సంస్థలు, రాష్ట్ర అధిపతులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఈ పుస్తకాల కాపీలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆల్బమ్ సంపాదకీయ భాగస్వాముల కోసం వెతుకుతున్నపుడు తమకు ఎయిర్ ఇండియా యూకె సహకరించేందుకు ముందుకు వచ్చిందని, అదే తమకు మైలురాయిగా చెప్పాలని ఫ్రీడ్ తెలిపారు. క్వీన్ పుట్టినరోజు వేడుకల సందర్భంలో భారతదేశానికి బ్రిటన్ తో ఉన్న బలమైన సంబంధాలు మరోసారి వ్యక్తమౌతున్నాయని, సెయింట్ జేమ్స్ హౌస్.. ఎయిర్ ఇండియా యూకె ను మంచి సంపాదకీయులుగా గుర్తించి చారిత్రక ఉత్సవాలకు ఆహ్వానించడం ఎంతో గర్వంగా చెప్పుకోవాలని బ్రిటన్ లోని ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ తారా నాయుడు అన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా బ్రిటన్ తో చారిత్రక సంబంధాలు కలిగి ఉందని, అందుకు 1948 జూన్ 8న నాలుగు ఇంజన్ల తో కూడిన మొదటి విమానాన్ని కెయిరో జెనీవాల మీదుగా లండన్ కు పంపడమే పెద్ద ఉదాహరణగా చెప్పాలని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశంనుంచి ఐదు రోజువారీ విమానాలను ఎయిర్ ఇండియా లండన్ బర్మింగ్ హామ్ కు నడుపుతోన్నట్లు తెలిపారు. -
స్టార్ కథానాయిక అవసరం లేదు
ముంబై: యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ సారథ్యంలో త్వరలో రూపొందనున్న ‘ఫ్యాన్’ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా తెలియకపోయినప్పటికీ ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరం లేదని నటుడు షారుఖ్‌ఖాన్ చెప్పాడు. 48 ఏళ్ల ఖాన్... ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కారణంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ‘బ్యాండ్ బాజా బారాత్’ దర్శకుడు మనీష్ శర ్మ తీస్తున్న ఈ సినిమాలో ఖాన్ రకరకాల అవతారాల్లో కనిపించనున్నాడు. ‘యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస, మనీష్ శర్మలంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో ఇద్దరు యువతులు ఉం టారు. ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరమే లేదు. ఇది అత్యంత ఆసక్తికరమైనదే కాకుండా విభిన్నమైన సినిమాకూడా. గత 20 సంవత్సరాల కాలంలో నేను నటించిన సినిమాల్లోకెల్లా ఇది అత్యంత సవాళ్లతో కూడినది. సినిమా నటుల అభిమానుల గురించి తీస్తున్న సినిమా ఇది’ అని అన్నాడు. కాగా ఖాన్.. రాహుల్ ధొలాకియా తీయనున్న ‘రయీస్’తోపాటు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించనున్న తాజా సినిమాలకు సంతకాలు చేసేశాడు. మరో సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ‘రయీస్’ ఓ విభిన్నమైన సినిమా. దీని గురించి రాహుల్ ధొలాకియా నాకు పూర్తిగా వివరించాడు. నాకు ఎంతోబాగా నచ్చింది’ అని అన్నాడు. ఇదిలాఉంచితే దీపావళి పండుగకు విడుదల కానున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకు ఖాన్ అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత్వం వహించింది. -
భద్రత కోసం బీసేఫ్...
భలే ఆప్స్... స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలుసు. ఇష్టమైన వారి క్షేమ సమాచారాలు ఫోన్ ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా తెలుసుకునేందుకు వీలు కల్పించే అప్లికేషన్ బీసేఫ్. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఈ సెక్యూరిటీ అప్లికేషన్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎప్పుడు ఎక్కడున్నారు? అన్న విషయాన్ని తెలుపుతుంది. పిల్లలు ఏదైనా కొత్త కాంటాక్ట్‌ను స్టోర్ చేసుకున్న వెంటనే ఆ విషయం తల్లిదండ్రులకు తెలియజేస్తుంది. ఫాలోమీ అన్న ఫీచర్ ద్వారా మీరు ఉన్న ప్రాంతాన్ని మీ కాంటాక్ట్స్‌లోని వ్యక్తులు కూడా తెలుసుకునేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీ కాంటాక్ట్స్‌లోని వారికి ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు. ఎవరైనా ఒక్కరికి ఎస్ఎంఎస్ తోపాటు ఫోన్‌కాల్ అందేలా చేయవచ్చు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా ఆటోమేటిక్‌గా చేపడుతుంది.