బాలీవుడ్ టీవీ సీరియల్ నటుడు వరుణ్ సూద్ కంకషన్ (తేలికపాటి బాధాకరమైన మెదడు గాయం)తో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రాంలో తెలిపాడు. తాను చికిత్స తీసుకుంటున్నానని, స్క్రీన్ టైం నివారించమని చెప్పడంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అసలేంటి మెదడు గాయం?. ఎందువల్ల వస్తుందంటే..?
నిపుణులు అభిప్రాయం ప్రకారం..హింసాత్మకమైన కుదుపు లేదా తలపై బలంగా తగిలిన దెబ్బ కారణంగా మెదడు గాయం సమస్య వస్తుంది. శిశువుల నుంచి వృద్ధులు వరకు ఎవరైన ఈ సమస్యను బారినపడవచ్చు. ఇది తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది. సుమారు 14 నుంచి 21 రోజుల్లో రికవరీ అవుతారని వైద్యులు తెలిపారు.
ఈ సమస్య వల్ల నరాలు, రక్తనాళాలు తీవ్రంగా గాయపడటం, తద్వారా మెదడులో రసాయన మార్పులకు లోనవ్వడం జరుగుతుంది. దీని ఫలితంగా మెదడు పనితీరుని తాత్కాలికంగా కోల్పోతుంది. ఐతే ఈ సమస్య మెదడుకు శాశ్వత నష్టం కలిగించదు కానీ నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తుంది. దీని వల్ల ప్రాణాహాని జరగదు కానీ ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. అది రోజుల, వారాలు లేదా ఎక్కువ కాలం పాటే కొనసాగే అవకాశాలు ఉంటాయి.
ఈ సమస్య ఎవరికీ ఎక్కువంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంకషన్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ..
నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, వృద్ధులు ఈ ప్రమాదం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
యువకులు, బైక్ ప్రమాదాలు, క్రీడలకు సంబంధించిన తల గాయాల కారణంగా
సైనిక సిబ్బంది పేలుడు పరికరాలకు గురికావడం వల్ల
కారు ప్రమాదంలో తలకు బలమైన గాయమైన
శారీరక వేధింపులకు గురైన బాధితులు
అంతకుమునుపు మెదుడు గాయం సమస్యను ఎదుర్కొన్నవారు
కౌమారదశలో ఉన్నవారు ఇతర వయస్సుల వారి కంటే కంకషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారి మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్నందున ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ సమస్య లక్షణాలు..
తలనొప్పి
వికారం లేదా వాంతులు
గందరగోళం
స్పృహ, తాత్కాలిక నష్టం
సంతులనం, మైకం సమస్యలు
ద్వంద్వ దృష్టి
చెవుల్లో మోగుతోంది
కాంతి, శబ్దానికి సున్నితత్వం
అలసటగా లేదా మగతగా అనిపిస్తుంది
అర్థం చేసుకోవడం లేదా ఏకాగ్రత చేయడంలో సమస్య
డిప్రెషన్ లేదా విచారం
చిరాకుగా, నాడీగా ఆత్రుతగా ఉండటం
శ్రద్ధ పెట్టడం కష్టం
మెమరీ నష్టం
అయితే శిశువులు, పసిబిడ్డలు వారి తలపై కంకషన్ కలిగి ఉన్నప్పటికీ వారికి ఎలా అస్తుందనేది తెలియజేయలేరు కాబట్టి రోగనిర్ధారణ చేస్తే గానీ చెప్పడం కష్టమని చెప్పారు. ఇక పిల్లలలో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
తలపై గడ్డలు
వాంతులు అవుతున్నాయి
చిరాకుగా, పిచ్చిగా, అనియంత్రిత ఏడుపు
తినడం మానేయడం
నిద్ర విధానంలో మార్పు, అసాధారణ సమయాల్లో నిద్ర రావడం
సాధారణం కంటే ఎక్కువ గజిబిజిగా, ఓదార్చినప్పటికీ ఏడుపు ఆగదు
శూన్యంలోకి చూడటం
నిర్ధారణ ఎలా?
తల గాయానికి దారితీసిన సంఘటన, లక్షణాల గురించి వైద్య నిపుణుడికి చెప్పడం వంటివి చేయాలి. అప్పుడు నరాల పరీక్ష ద్వారా వైద్యులు పరిస్థితిని గుర్తించడం జరుగుతుంది.
ఈ పరీక్షలో..
నరాల పనితీరు, ప్రతిచర్యలు
దృష్టి, కంటి కదలిక, కాంతికి ప్రతిచర్య
వినికిడి
యాక్టివిటీ
మెడ కండరాలు కదలికలు
వారి మానసిక స్థితి మార్పులు, నిద్ర మార్పులు లేదా ప్రవర్తనలో ఏవైనా మార్పులను బట్టి ఈ సమస్య బాధపడుతున్నారని గుర్తించొచ్చని వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment