మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. అయితే పలు కారణాల దృష్ట్యా అందరికీ కుంభమేళాకు వెళ్లే అవకాశం లభించదు. అలాంటప్పుడు చింతించకుండా ఉండేందుకు ఒక మార్గాన్ని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు.
కుంభమేళాకు వెళ్లే అవకాశం లేనివారు ఈ మేళాకు వెళ్లినవారిని అడిగి కుంభమేళా జలాలను తీసుకోవాలని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ఆ నీటిని మీ ఇంటిలోని నీటి బకెట్‌లో వేసుకుని, ఆ నీటితో స్నానం చేయాలని తెలిపారు. ఇలా చేయడం ద్వారా కుంభస్నానం చేసినంతటి ఫలితాలనే పొందుతారని శంకరాచార్య స్వామి అన్నారు.
మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నుంచి నీటిని, ప్రసాదాన్ని పంపేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటిని సంప్రదించి మన ఇంటికి నీటిని తెప్పించుకోవచ్చని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ‘త్రివేణి సంగమ్ వాటర్ డెలివరీ సర్వీస్’ కుంభమేళా నుండి నీటిని ఇంటికి నేరుగా డెలివరీ చేస్తోందని తెలిపారు.
ఏదైనా కారణం చేత మహా కుంభమేళా నీటిని మీరు పొందలేకపోతే మీ ఇంట్లో ఉంచుకున్న గంగా జలంలోని కొన్ని చుక్కలను బకెట్‌లో కలుపుకుని స్నానం చేయడం ద్వారా కూడా పుణ్యం పొందవచ్చని శంకరాచార్య స్వామి తెలిపారు. ఇలా స్నానం చేసిన తరువాత దానధర్మాలు చేయడం ఉత్తమఫలితాలనిస్తుందని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: ఒక్కో ఘాట్‌కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం
Comments
Please login to add a commentAdd a comment