Holy Water
-
నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించే నాగోబా మహా పూజకు గంగాజలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం బయల్దేరి వెళ్లారు. ఏడు రోజులపాటు మెస్రం వంశీయులున్న గ్రామాల్లో నాగోబా మహాపూజ, గంగాజలం సేకరణపై ప్రచారం నిర్వహించి కేస్లాపూర్ చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు అదివారం కేస్లాపూర్ గ్రామానికి చేరి నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ ఆధ్వర్యంలో సమావేశమై గంగాజలం పాదయాత్ర, నాగోబా మహాపూజ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఝరి (కలశం) దేవతకు మెస్రం వంశీయులు, మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం గంగాజలం సేకరణ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు బుందో పట్టగా... మెస్రం వంశీయులు కానుకలు వేసి ముందుకు సాగారు. -
పవిత్ర జలంలో బ్రాందీ కలిపేశారు
సాక్షి, ప్యారిస్: ప్రాంక్ వీడియోల పేరిట కొందరు ఎదుటివారికి తెలీకుండా సరదా చేష్టలను వీడియోలు తీయటం, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి హిట్లు తెచ్చుకోవటం చేస్తుంటారు. అలాంటి కొంటె బ్యాచ్ ఒకటి ఫ్రాన్స్ లోని ఛట్యూ-ఛలోన్ పట్టణంలోని ఓ చర్చిలో చేసిన పని ఇప్పుడు కలకలం రేపుతోంది. జురా చర్చిలో పవిత్ర జలంతో నిండి ఉండే రెండు ఫౌంటెన్లలో(తొట్టి) మద్యం కలిపేశారు. ఇది గమనించిన కొందరు టూరిస్ట్‌లు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... హుహాహుటిన వాటిని ఖాళీ చేయించి శుభ్రపరిచారు. ఆగష్టు చివరి వారంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దీనిని ఎవరూ చేశారు? ఎందుకు చేశారు? అన్నదానిపై స్పష్టత లేకపోయినా... సరదా కోసం ప్రాంక్‌స్టర్లు ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేను ఫౌంటెన్ పక్క నుంచి వెళ్తుండగా ముందు మందు వాసన వచ్చింది. పవిత్ర జలాన్ని స్వీకరించినప్పుడు అది ఆల్కాహాల్ అన్న విషయం స్పష్టమైంది. అయితే అది అనవాయితీ కావొచ్చేమోననుకుని అధికారులను అడిగాను. తర్వాతే అసలు విషయం అర్థమైంది అని ఓ సందర్శకుడు వ్యాఖ్యానించారు. ఘటనపై చర్చి అధికారి పౌలిన్ స్పందించారు. ఒక లీటర్ బ్రాందీని రెండు తొట్టిలలో పోసేశారు. దీనికి కారకులను త్వరలోనే పట్టుకుంటాం అని ఆయన చెప్పారు.