పవిత్ర జలంలో బ్రాందీ కలిపేశారు
పవిత్ర జలంలో బ్రాందీ కలిపేశారు
Published Sat, Sep 9 2017 2:07 PM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM
సాక్షి, ప్యారిస్: ప్రాంక్ వీడియోల పేరిట కొందరు ఎదుటివారికి తెలీకుండా సరదా చేష్టలను వీడియోలు తీయటం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి హిట్లు తెచ్చుకోవటం చేస్తుంటారు. అలాంటి కొంటె బ్యాచ్ ఒకటి ఫ్రాన్స్ లోని ఛట్యూ-ఛలోన్ పట్టణంలోని ఓ చర్చిలో చేసిన పని ఇప్పుడు కలకలం రేపుతోంది.
జురా చర్చిలో పవిత్ర జలంతో నిండి ఉండే రెండు ఫౌంటెన్‌లలో(తొట్టి) మద్యం కలిపేశారు. ఇది గమనించిన కొందరు టూరిస్ట్‌లు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... హుహాహుటిన వాటిని ఖాళీ చేయించి శుభ్రపరిచారు. ఆగష్టు చివరి వారంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దీనిని ఎవరూ చేశారు? ఎందుకు చేశారు? అన్నదానిపై స్పష్టత లేకపోయినా... సరదా కోసం ప్రాంక్‌స్టర్లు ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నేను ఫౌంటెన్ పక్క నుంచి వెళ్తుండగా ముందు మందు వాసన వచ్చింది. పవిత్ర జలాన్ని స్వీకరించినప్పుడు అది ఆల్కాహాల్ అన్న విషయం స్పష్టమైంది. అయితే అది అనవాయితీ కావొచ్చేమోననుకుని అధికారులను అడిగాను. తర్వాతే అసలు విషయం అర్థమైంది అని ఓ సందర్శకుడు వ్యాఖ్యానించారు. ఘటనపై చర్చి అధికారి పౌలిన్ స్పందించారు. ఒక లీటర్ బ్రాందీని రెండు తొట్టిలలో పోసేశారు. దీనికి కారకులను త్వరలోనే పట్టుకుంటాం అని ఆయన చెప్పారు.
Advertisement