టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు! | Scientists Explains Why You Shouldnt Put Tomatoes In The Fridge | Sakshi
Sakshi News home page

టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!

Published Thu, Dec 14 2023 2:25 PM | Last Updated on Thu, Dec 14 2023 6:42 PM

Scientists Explains Why You Shouldnt Put Tomatoes In The Fridge - Sakshi

సాధారణంగా టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఫ్రిజ్‌లో పెడితే కనీసం ఓ వారం అయినా వాడుకోవచ్చు. అందులో అయితే కనీసం నాలుగురోజుల వరకు పాడవ్వకుండా కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇలా ఫ్రిజ్‌లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టొదని హెచ్చరిస్తున్నారు కూడా. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. 

ఎందుకు పెట్టకూడదంటే..

  • ఫ్రిజ్‌లో పెడితే టమాటాలు ముందుగా వాటికుండే సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయని చెబతున్నారు పరిశోధకులు. 39 డిగ్రీల చల్లటి ఉష్టోగ్రతలో ఉన్న టమాటాల్లో వాటికి సహజంగా ఉండే వాసన ఎలా కోల్పోతుంది పరిశోధనలో వెల్లడైంది. 
  • ఒకటి రెండు రోజులు ఫ్రిజ్‌లో ఉంటే పర్లేదు గానీ చాలా రోజులు ఫ్రిజ్‌లో ఉంటే మాత్రం టమాటకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుందని చెప్పారు. అలాగే దాని డీఎన్‌ఏ మిథైల్‌ సంశ్లేషణలో మార్పులు వస్తాయని అన్నారు. 
  • మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం. జీవి డీఎన్‌ఏకి అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియ ఇది కీలకం. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా లేకపోతే  అసాధారణ వ్యాధుల వచ్చేందుకు దారితీస్తుంది.
  • ఎప్పడైతే సుదీర్థకాలం రిఫ్రిజిరేటర్‌లో టమోటాలు ఉంచుతామో వాటి లోపల ఉన్న జెల్లీ విరిగిపోతుంది. దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది. ఒకరకంగా చెప్పాలంటే లోపలంతా జ్యూసీగా అయిపోతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు.
  • టమాటాలు పండినప్పడు ఇథిలిన్‌ను విడుదల చేస్తాయి. ఐతే ఫ్రిజ్‌లోని చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్‌ ఉత్పత్తిని నిలిచిపోతుంది.. దీంతో టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది. 
  • టమాటాలు పండినప్పుడు ఇథిలిన్‌ను విడుదల చేస్తాయి. ఐతే రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనం ఈ ఇథిలీన్‌ ఉత్పత్తిని నిలిపేస్తుంది. ఇది టమోటాలు రుచిని కోల్పోవడానికి లేదా పుల్లగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి టమోటాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుదీర్ఘకాలం ఫ్రిజ్‌లో ఉన్న టమాటాలు విషంతో సమానమని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాగా, తాము ప్రస్తుతం చల్లదనంలో కూడా టమాటాలు రుచిని కోలపోకుండా ఉండేలా పలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు.

(చదవండి: టైప్‌ 2 డయాబెటిస్‌ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు! శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్‌పెట్టేలా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement