How To Buy Tomatoes Rs.70 KG: భారతదేశంలో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటున్నాయి. రైతులు మంచి లాభాలు పొందుతున్నప్పటికీ సామాన్యులకు ఇది పెనుభారంగా మారిపోయింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ. 200 దాటినట్లు సమాచారం. భారీ ధర వద్ద లభించే టమాటాలను తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టమాటా ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆన్‌లైన్‌లో సరసమైన ధరకే విక్రయించడం ప్రారంభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కేవలం వారం రోజుల్లో ఏకంగా 10,000 కేజీల టమాటాలు అమ్ముడు కావడం గమనార్హం. ఇది ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉంది.
రూ. 70కే పేటీఎమ్ భాగస్వామ్యంతో ఓఎన్డీసీ విక్రయిస్తోంది. పేటీఎమ్, మ్యాజిక్ పిన్, మై స్టోర్ వంటి యాప్స్ ద్వారా కూడా టమాటాలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఒక కస్టమర్ వారానికి కేవలం 2 కేజీల టమాటాలు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తే డోర్ డెలివరీ పొందవచ్చు. దీనికి ఎటువండి అడిషినల్ ఛార్జెస్ ఉండవు.
ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి..
పేటీఎమ్‌లో ఆర్డర్ చేసే విధానం..
- స్మార్ట్‌ఫోన్లో లోకేష్ ఆన్ చేసుకున్న తరువాత, యాప్‌లో ఓఎన్డీసీ ఫుడ్ అని సర్చ్ చేయాలి.
- ఓఎన్డీసీ ఓపెన్ అయిన తరువాత సమీపంలో ఉన్న స్టోర్స్ కనిపిస్తాయి, ఇందులో దాదాపు అన్నీ మీ లొకేషన్‌కు సమీపంలో ఉన్నవే ఉంటాయి.
- ఇందులో మీ దగ్గరగా ఉన్న ఒక స్టోర్ ఎంచుకోవాలి, ఆ తరువాత ఆర్డర్ చేసుకోవాలి.
- ఇవన్నీ పూర్తయిన తరువాత డెలివరీ పొందాల్సిన అడ్రస్ సెట్ చేసుకుని, ఆ తరువాత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.
- ఇలాగే మీరు మ్యాజిక్‌పిన్ ద్వారా కూడా టమాటాలు ఆర్డర్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment