
గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎదిగిపోయాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ ధర రూ. 200 దాటింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌సిసిఎఫ్ టమోటాలను కిలో రూ.70కి అందజేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఓఎన్‌డీసీ (ONDC) కొనుగోలుదారులకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా ఆన్‌లైన్‌లో రూ. 70కి అందిస్తోంది. దీనికోసం పేటీఎం యాప్ ద్వారా కస్టమర్ ఆర్డర్ చేయవచ్చని, ఒక కస్టమర్ కేవలం 2 కేజీల టమాటలను మాత్రమే ఆర్డర్ చేసుకోవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ టి కోశి తెలిపారు. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది.
పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గత వారంలో టమాటాలను సబ్సిడీపై విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)లను ఆదేశించింది.
(ఇదీ చదవండి: ఐఐటీ నుంచి సాఫ్ట్‌వేర్.. లక్షల ఉద్యోగం వదిలి కమెడియన్‌గా.. ఎంత సంపాదిస్తున్నాడంటే?)
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొదట్లో కేజీ టమాటలను రూ.90కి విక్రయించారు. ఆ తరువాత జులై 16 నుంచి కేజీ రూ.80కి, జూలై 20 నుంచి కిలో రూ.70కి తగ్గించారు. మొత్తం మీద అధిక ధరల నుంచి ప్రజలను కొంత వరకు విముక్తి కలిగించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.