Onion Price Hike, Centre To Sell Onions At Subsidised Rate Of Rs 25 Per Kg In Delhi - Sakshi
Sakshi News home page

Onion Prices Hike: ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం - రేపటి నుంచే అమలు!

Published Sun, Aug 20 2023 7:06 PM | Last Updated on Mon, Aug 21 2023 10:49 AM

Onion price hike centre sell subsidised rate rs 25 per kg delhi - Sakshi

గత కొన్ని రోజులకు ముందు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి.. ఇక ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో ఉల్లి ఘాటెక్కిపోతోంది. భారతీయ మార్కెట్లో ధరల నియంత్రణతో పాటు, సరఫరా మెరుగుపరచడానికి కేంద్రం నిన్న 40 శాతం టాక్స్ విధించింది.

ఢిల్లీ ప్రజలకు ఉల్లి ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి తక్కువ ధరకే విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) నిర్ణయించింది. కావున రేపటి నుంచి దేశ రాజధానిలో ఉల్లి కేజీ రూ. 25కి విక్రయించనున్నారు. 

2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను రూపొందించింది. ఈ ఏడాది బఫర్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రారంభంలో ఢిల్లీలో బఫర్ ఉల్లిపాయలను రిటైల్ చేయడం ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా..

ఢిల్లీలో రేపు సుమారు 10 మొబైల్ వ్యాన్‌లు దీని కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆ తరువాత క్రమంగా వీటిని మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తక్కువ ధరకే ఉల్లి విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement