దోహా: ఆసియా ఖండంలోని వర్ధమాన టెన్నిస్ ఆట గాళ్ల అభివృద్ధి కోసం ఓ కొత్త వేదిక ఏర్పాటయ్యింది. కేవలం ఆసియాలోని దేశాలకు చెందిన యువ ఆటగాళ్లు మాత్రమే పోటీ పడేందుకు ఆసియన్ టెన్నిస్ టూర్ (ఏటీటీ)ను ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన ఆసియా టెన్నిస్ సమాఖ్య (ఏటీఎఫ్) బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో ఏటీటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 18 నుంచి ఏటీటీ తొలి పోటీలు ఢిల్లీలో జరుగుతాయి. ఈ టోర్నీలో ఆడి గెలిచినందుకు ఆటగాళ్లకు ఎలాంటి ర్యాంకింగ్స్ పాయింట్లు లభించకున్నా డబ్బులు మాత్రం అందుతాయి. ఏటీటీలో టాప్-5 ఆటగాళ్లుగా నిలిచినవారు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)తో పర్యటించే అవకాశం లభిస్తుంది. రెండు విభాగాలుగా ఈ ఈవెంట్ జరుగుతుంది.