Be ready to spend more on Airfares as jet fuel prices to hike - Sakshi
Sakshi News home page

టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!

Published Wed, Aug 2 2023 10:17 AM | Last Updated on Wed, Aug 2 2023 11:32 AM

Be ready to spend more airfares as Jet fuel price hiked - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్‌ సంస్థలు విమాన ఇంధన (ఏటీఎఫ్‌) రేటును ఏకంగా 8.5 శాతం పెంచాయి. అటు వాణిజ్య వంట గ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ. 100 మేర తగ్గించాయి. తాజా మార్పులతో ఢిల్లీలో ఏటీఎఫ్‌ రేటు కిలోలీటరుకు రూ. 7,728 పెరిగి రూ. 98,508కి చేరింది. దీంతో వరుసగా రెండో నెలా విమాన ఇంధనం రేటు పెరిగినట్లయింది. జూలై 1నే ఇది 1.65శాతం  మేర (కిలోలీటరుకు రూ. 1,477) పెరిగింది. అంతకు ముందు ఆయిల్‌ కంపెనీలు నాలుగు సార్లు తగ్గించాయి.

కొత్త రేట్లు మంగళవారంనుంచి అమల్లోకి వచ్చాయి. పెంపు తర్వాత, న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్‌కు రూ.7,728 పెరిగి రూ.98,508.26కి చేరుకుంది. ముంబైలో కిలోలీటర్‌కు రూ.84,854.74 నుంచి రూ.92,124.13కి పెరిగింది.

డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మెట్రోలలో (రూపాయిలు/కేఎల్) ఏటీఎఫ్ ధరలు
న్యూఢిల్లీ - 98,508.26
కోల్‌కతా - 1,07,383.08
ముంబై - 92,124.13
చెన్నై- 1,02,391.64
ఇంటర్నేషనల్ రన్‌లో డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్  మెట్రోలలో ఏటీఎఫ్  ధరలు (డాలర్లు/కిలో)
ఢిల్లీ-902.62
కోల్‌కతా-941.09
ముంబై-900.73
చెన్నై- 897.83

ఇక 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ. 100 తగ్గి రూ. 1,680కి లభించనుంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్‌ రేటు యథాతథంగా రూ. 1,103 (14.2 కేజీల సిలిండర్‌) ఉంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్‌ రేట్లను సవరిస్తాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement