
సాక్షి, ఢిల్లీ : దేశంలో పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారమైన 15వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. పెట్రోల్‌పై లీటర్‌కు 35 పైసలు, డీజిల్‌పై లీటరుకు 56 పైసలు పెంచాయి. గడిచిన 15 రోజుల్లో లీటర్ పెట్రోల్‌కు 8.03 రూపాయలు, డీజిల్ 8.27 రూపాయల మేర పెరిగాయి. పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పరిశీలిస్తే..
లీటర్ పెట్రోల్ ధర :
చెన్నైలో 82.27 రూపాయలు
ఢిల్లీలో 78.88 రూపాయలు
కోల్‌కతా 80.62 రూపాయలు
ముంబైలో 85.70 రూపాయలు
హైదరాబాద్‌లో 81.88 రూపాయలు
లీటర్ డీజిల్ ధర :
చెన్నైలో 75.29 రూపాయలు
ఢిల్లీలో 77.67 రూపాయలు
కోల్‌కతాలో 73.07 రూపాయలు
ముంబైలో 76.11 రూపాయలు
హైదరాబాద్‌లో 75.91రూపాయలకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment