సాక్షి, న్యూఢిల్లీ: ఒక రోజుగా గ్యాప్ తరువాత వరుసగా శుక్రవారం, నేడు(శనివారం) రెండు రోజూ ఇంధన ధరలు ఊపందుకున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇప్పటికే పెట్రో ధర రూ.100 మార్క్‌ను దాటేసింది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది . ఈ పెంపుతో వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 102 మార్క్‌ను దాటగా, విజయవాడలో సుమారు 102 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని నగరంలో పెట్రోల్ రూ.96.12, డీజిల్ రూ.86.98 గా ఉంది. ఈ నెలలో 12 రోజుల కాలంలో ఇప్పటివరకు ఏడు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి.
తొలిసారి 100 దాటిన డీజిల్ ధర: దేశంలో తొలిసారిగా డీజిల్ ధర100 రూపాయలు దాటింది, రాజస్థాన్‌లో లీటరు డీజిల్ ధర ఇపుడు రూ. 100.05 వద్ద అమ్ముడవుతోంది.
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు
ఢిల్లీలో పెట్రోల్ రూ.96.12, డీజిల్ రూ.86.98
ముంబైలో పెట్రోల్ రూ.102.30, డీజిల్ రూ.94.39
చెన్నైలో పెట్రోల్ రూ.97.43, డీజిల్ రూ. 91.64
కోల్‌కతాలో రూ.96.06 డీజిల్ రూ.89.83
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.99.90, డీజిల్ రూ.94.82
విజయవాడలో పెట్రోల్ రూ.101.88, డీజిల్ రూ.96.23
వైజాగ్‌లో పెట్రోల్ రూ.101.05, డీజిల్ రూ.95.41
చదవండి: Weekend love: ఈ వీడియోలను చివరిదాకా చూస్తే..
H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట
Comments
Please login to add a commentAdd a comment