న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. వీటి ఎగుమతులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ టాక్స్‌ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కు పెంచుతూ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.2 నుంచి రూ.9 కి పెంచింది. దీంతోపాటు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ.13,000 నుంచి రూ.13,300కి పెరిగింది. మార్జిన్ల పెరుగుదలకు అనుగుణంగా ఎగుమతులపై పన్నును పెంచారు. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్‌లలో మార్పులు, ఒపెక్, దాని మిత్రదేశాల అంచనా ఉత్పత్తి తగ్గింపునకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తయ్యే చమురుపై కూడా లెవీని పెంచింది. (షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్)
ఇది చదవండి: SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కాగా దేశంలో మొదటిసారిగా జూలై 1న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను విధించిందిప్రభుత్వం. పెట్రోల్, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 ఎగుమతి సుంకం విధించి. ఆ తరువాత జూలై 1న డీజిల్ ఎగుమతిపై రూ. 13 పన్ను విధించింది.జూలై 20న జరిగిన మొదటి పక్షంవారీ సమీక్షలో, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.6 ఎగుమతి సుంకం రద్దు చేయడంతోపాటు, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిపై లీటరుకు రూ. 2 చొప్పున టాక్స్ తగ్గించింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్‌పై పన్నును టన్నుకు రూ.17వేలకు తగ్గించింది. మళ్లీ ఆగస్టు 2న డీజిల్, ఎటీఎఫ్ ఎగుమతులపై పన్ను తగ్గించింది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీని టన్నుకు రూ.17,750కి పెంచింది. తదనంతరం, ఆగస్టు 19న, మూడవ పక్షంవారీ సమీక్షలో, డీజిల్‌పై ఎగుమతి పన్ను రూ. 7కు పెంచి,ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 2ల పన్ను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment