
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం గురువారం లీటరుకు రూ.5 నుంచి రూ. 7కు పెంచింది. అలాగే జెట్ ఇంధన (ఏటీఎఫ్) ఎగుమతులపై లీటరుకు రూ.2 పన్నును తిరిగి ప్రవేశపెట్టింది. కాగా, దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై పన్నును టన్నుకు రూ.17,750 నుంచి రూ.13,000కు తగ్గించింది.
ఈ మేరకు ఆర్థికశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో ఏటీఎఫ్‌పై విడ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మార్జిన్లు పెరిగిన నేపథ్యంలో ఎగుమతులపై ప్రభుత్వం పన్ను పెంచింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోయినందున దేశీయంగా ఉత్పత్తయిన చమురుపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment