
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రవాస భారతీయులు
సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఫ్) ఆధ్వర్యంలో భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రీడాల్మేర్ - యూప్ జాన్ పార్క్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రవాస భారతీయులు సిడ్నీలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం వ్యవస్థాపక సభ్యుడు వినోద్ ఏలేటి, అధ్యక్షుడు అశోక్ మాలిష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకలకు హాజరైన ఎన్నారైలందరికీ భారతీయ మిఠాయిలను పంచిపెట్టారు.
ఏటీఫ్ స్వచ్ఛంద, సేవా కార్యక్రమాలను ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను తెలిపారు. గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, వల్లభాయి పటేల్ లాంటి మహానీయులను గుర్తు చేసుకోవడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ 69 ఏళ్లలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని గణతంత్ర వేడుకల కు హాజరైన ఎన్నారైలందరికీ ప్రదీప్ సేరి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జాతీయోద్యమం, ఆటలు, సినిమా, వివిధ రంగాలపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవర్దన్, సుమేష్ రెడ్డి , వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటి, కవిత, సంగీత, రూప , సందీప్ మునగాల, అనిల్ మునగాల ప్రశాంత్ కడపర్తి, మిథున్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment