
Aviation Turbine Fuel Price Hiked: కోవిడ్-19 రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యంది. పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో ప్రకటించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో విమానయాన రంగం పుంజుకుంది. ఐతే తాజాగా మరో చమురు సంస్థలు విమానయాన సంస్థలకు భారీ షాక్ ఇస్తూ జెట్ ఇంధనం(ఎయిర్ టర్బైన్ ఫ్యుయల్) ధరలను భారీగా పెంచాయి.
ఏకంగా రూ. 17 వేలకు పైగా..!
చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనంపై కిలోలీటర్‌కు రూ.17,136 చొప్పున పెంచాయి.దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ రూ.1.10 లక్షలకు చేరుకుంది. జెట్ ఇంధన ధరల పెరుగుదలతో విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఆయా ఎయిర్‌లైన్ సంస్థలో ఇంధన నిర్వహన వ్యయమే దాదాపు 40 శాతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధర అధికంగా ఉండడంతో ఈ ఏడాదిలో ఏటీఎఫ్ ధరలను చమురు సంస్థలు పెంచడం ఇది ఆరోసారి.
మరింత ఖరీదు..!
ఎటీఎఫ్ ధరలను పెరగడంతో విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలను పెంచడం అనివార్యమైంది. గత రెండు, నాలుగు వారాల్లో డొమెస్టిక్ విమాన ప్రయాణ ఛార్జీలు 15 నుంచి 30 శాతం మేర పెరిగాయి. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు పెంపులో ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ.36,644.25 చొప్పున పెరిగాయి. ఇక కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్ఞాలను కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గినట్లు తెలుస్తోంది.
చదవండి: జెలన్ స్కీ కీలక ప్రకటన.. ఈ షేర్లపై భారీగా పెరుగుతున్న పెట్టుబడులు!
Comments
Please login to add a commentAdd a comment