crude oil companies
-
‘ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం’
పశ్చిమాసియాలో పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా అధికమవుతున్న చమురు ధరలను భారత్ గమనిస్తోందని చమురు వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు ధరలకు సంబంధించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామన్నారు. ‘ఎగ్జిన్మొబిల్ గ్లోబల్ ఔట్లుక్ 2024’ సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. మంత్రి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయితే, ఆ ప్రభావం దేశంలో ఇంధన లభ్యతపై ఉంటుంది.దేశానికి చమురు సరఫరాల్లో ఎటువంటి అవాంతరాలూ ఉండబోవని భావిస్తున్నాం.ప్రపంచంలోని మూడో అతిపెద్ద చమురు వినియోగ, దిగుమతి దేశమైన భారత్ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలదనే విశ్వాసంతో ఉన్నాం.దేశంలో చమురు కొరత లేదు. భారతదేశ అవసరాలకు తగిన నిల్వలు, వనరులు ఉన్నాయి. ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?మార్చిలో సగటున భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ బ్యారల్‌కు 83 నుంచి 84 డాలర్లు ఉంటే, సెప్టెంబర్‌లో 73.69 డాలర్లకు తగ్గింది. అయితే తాజా పరిస్థితులు మళ్లీ ధరల పెరుగుదలపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. దేశంలో పెట్రోల్–డీజిల్ ధరలు లీటర్‌కు 2 నుంచి 3 వరకూ తగ్గే వీలుందని గత వారం రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొన్న నేపథ్యంలోనే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం. -
ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
ప్రభుత్వ ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 6శాతం, నాన్ మేనేజిరియల్ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి. -
ఎన్నికలపర్వం ముగిస్తే భారం తప్పదా.?
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ చమురు ధర 90 యూఎస్ డాలర్లకు చేరింది. కానీ భారత్‌లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఎన్నికలవేళ వీటిలో మార్పులు చేస్తే ఓటర్లలో కొంత వ్యతిరేకత వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నా వాటిని ప్రజలకు పాస్‌ఆన్ చేయడంలో కేంద్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై భారీగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలను పెంచేలో దోహదం చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యవహారం మరింత ముదిరితే పరిస్థితులు చేదాటిపోయి దేశీయంగా ఇంధన ధరలు పెరగడం ఖాయమని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల మొదటివారంలో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కూడా ధ్రువీకరించింది. దీంతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ 300లకుపైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఈ దేశాల మధ్య వివాధం మరింత ముదిరితే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్‌పై ప్రతీకార దాడుల్లో తాము పాల్గొనబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్న నేపథ్యంలో ఒమన్, ఇరాన్‌ల మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి కీలకంగా మారనుంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుందని అంచనా. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్ అడ్డుకుంది. ఇది ఇంతటితో ఆగకపోతే కష్టమే. ఒపెక్ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్‌ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ జలసంధిగుండా ప్రయాణించే చమురు నౌకలను నిలిపేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. ఇదీ చదవండి: 5,500 మందితో హైదరాబాద్‌లో భారీ ఎక్స్పో.. ఎప్పుడంటే.. ఎన్నికల వేళ ఆచితూచి.. యుద్ధ భయాలు ఇలాగే కొనసాగితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగడం ఖాయమని తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్‌కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్‌ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్‌గా ఉందని తెలిపారు. -
కమోడిటీ, చమురు మార్కెట్లకు ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక
మిడిల్ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణల వల్ల ప్రపంచ కమోడిటీ, ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇప్పటివరకు పరిమిత ప్రభావం ఉన్నప్పటికీ, ఇంధన మార్కెట్, ఆహార భద్రతపై కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచబ్యాంక్ తాజా కమోడిటీ మార్కెట్లకు సంబంధించి ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికంలో చమురు ధరలు సగటున బ్యారెల్‌కు 90 యూఎస్ డాలర్లు ఉంటుందని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో వచ్చే ఏడాది బ్యారెల్‌కు సగటున 81 డాలర్లకు తగ్గుతుంది. ప్రపంచ చమురు సరఫరా రోజుకు 20లక్షల నుంచి 5లక్షల బ్యారెళ్లకు తగ్గుతుందని దాంతో ధరలు 3-13 శాతం పెరుగుతాయని నివేదిక తెలిపింది. వచ్చే ఏడాది మొత్తం కమోడిటీ ధరలు 4.1 శాతం తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రానున్న కాలంలో సరఫరా పెరగడంతో వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. మూల లోహాల ధరలు 2024లో 5 శాతం తగ్గుతాయని తెలిసింది. అయితే 2025లో మాత్రం వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం. మిడిల్ఈస్ట్ దేశాల్లో 1970 తర్వాత తాజా యుద్ధ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మిత్గిల్ అన్నారు. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు.. మళ్ళీ పెంచారు
-
భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..!
Aviation Turbine Fuel Price Hiked: కోవిడ్-19 రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యంది. పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో ప్రకటించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో విమానయాన రంగం పుంజుకుంది. ఐతే తాజాగా మరో చమురు సంస్థలు విమానయాన సంస్థలకు భారీ షాక్ ఇస్తూ జెట్ ఇంధనం(ఎయిర్ టర్బైన్ ఫ్యుయల్) ధరలను భారీగా పెంచాయి. ఏకంగా రూ. 17 వేలకు పైగా..! చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనంపై కిలోలీటర్‌కు రూ.17,136 చొప్పున పెంచాయి.దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ రూ.1.10 లక్షలకు చేరుకుంది. జెట్ ఇంధన ధరల పెరుగుదలతో విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఆయా ఎయిర్‌లైన్ సంస్థలో ఇంధన నిర్వహన వ్యయమే దాదాపు 40 శాతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధర అధికంగా ఉండడంతో ఈ ఏడాదిలో ఏటీఎఫ్ ధరలను చమురు సంస్థలు పెంచడం ఇది ఆరోసారి. మరింత ఖరీదు..! ఎటీఎఫ్ ధరలను పెరగడంతో విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలను పెంచడం అనివార్యమైంది. గత రెండు, నాలుగు వారాల్లో డొమెస్టిక్ విమాన ప్రయాణ ఛార్జీలు 15 నుంచి 30 శాతం మేర పెరిగాయి. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు పెంపులో ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ.36,644.25 చొప్పున పెరిగాయి. ఇక కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్ఞాలను కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గినట్లు తెలుస్తోంది. చదవండి: జెలన్ స్కీ కీలక ప్రకటన.. ఈ షేర్లపై భారీగా పెరుగుతున్న పెట్టుబడులు! -
రష్యన్ చమురు కంపెనీలు భారత్ కు భారీ బంపర్ ఆఫర్..!!
-
దూసుకెళ్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఏడేళ్లలో మొదటిసారి బేరల్‌కు 93 డాలర్లు చేరడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధ్యతాయుత, సహేతుక ధరను భారత్ కోరుకుంటున్నట్లు రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. ఈ కమోడిటీ విషయంలో తీవ్ర ఒడిదుడుకులను నిరోధించాలని తాము చమురు ఉత్పత్తి దేశాలను కోరుతున్నట్లు తెలిపారు. దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు రేట్లకు అనుగుణంగా ఉంటాయి. దీనికితోడు దేశంలో పన్నుల భారం తీవ్రంగా ఉండడం ద్రవ్యోల్బణంపై ఒత్తిడులను పెంచుతోంది. ‘‘ముడిచమురు ధరల అస్థిరతపై భారతదేశం తన తీవ్ర ఆందోళనలను ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం), ఇతర అంతర్జాతీయ వేదికల చీఫ్‌ల దృష్టికి ద్వైపాక్షింగా తీసుకువెళుతోంది’’ అని తెలిపారు. మరో ప్రశ్నకు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానం చెబుతూ, 2021 డిసెంబర్ 1వ తేదీన బేరల్‌కు అంతర్జాతీయంగా 71.32 డాలర్లు ఉంటే, జనవరి 31వ తేదీ నాటికి 18.09 డాలర్లు పెరిగి 89.41 డాలర్లకు చేరిందని తెలిపారు. -
ఆగస్టులో తగ్గిన క్రూడ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 2.3 శాతం క్షీణించింది. అదే సమయంలో రిలయన్స్–బీపీకి చెందిన కేజీ–డీ6 క్షేత్రాల ఊతంతో సహజ వాయువు ఉత్పత్తి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో క్రూడాయిల్ ఉత్పత్తి 2.51 మిలియన్ టన్నులకు పరిమితమైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 20.23 శాతం పెరిగి 2.9 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. ప్రైవేట్ ఆపరేటర్ల క్షేత్రాల్లో ఉత్పత్తి 186 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. ముడిచమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. భారత్ తన క్రూడాయిల్ అవసరాల్లో 85 శాతం భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. 14 శాతం అధికంగా ప్రాసెసింగ్.. ఇంధనాలకు డిమాండ్ పుంజుకుంటూ ఉండటంతో చమురు రిఫైనరీలు ఆగస్టులో 14.17 శాతం అధికంగా 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను ప్రాసెస్ చేశాయి. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 13.6 శాతం, ప్రైవేట్ రంగ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.4 శాతం అధికంగా ముడిచమురును శుద్ధి చేశాయి. రిఫైనరీలు ఆగస్టులో 19.5 మిలియన్ టన్నుల మేర పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేశాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9 శాతం అధికం. ఇక ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో 12 శాతం అధికంగా 100.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఉత్పత్తి చేశాయి. రిఫైనరీలు గతేడాది ఆగస్టులో స్థాపిత సామర్థ్యంలో 76.1 శాతం స్థాయిలో పనిచేయగా.. ఈ ఏడాది 87 శాతం మేర పనిచేశాయి. చదవండి: కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! -
కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే!
ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన సంపదను మరింత వృద్ధి చేసుకోనున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రానున్న రోజుల్లో సుమారు రూ.60వేల కోట్లు డాలర్ల పెట్టుబడి పెట్టునున్నారు.ఈ పెట్టుబడులతో రూ.6.04 లక్షల కోట్లుగా ఉన్న ముఖేష్ అంబానీ సంపద మరింత పెరగనుంది. మనీ మేకింగ్ మిషన్ ముఖేష్ అంబానీకి గుజరాత్ జామ్ నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఉంది. ఈ కేంద్రం ద్వారా అరేబియా సముద్రంలో ముడి చమురును వెలికి తీసి ఫ్యూయల్, ప్లాస్టిక్, కెమికల్స్‌ను తయారు చేస్తారు. దీని విస్తీర్ణం సుమారు న్యూయార్క్ సిటీలో మాన్ హాటన్ ప్రాంతం సగం వరకు ఉంటుందని అంచనా. తద్వారా పైప్లైన్ల నెట్వర్క్ ఇక్కడ రోజుకు14 లక్షల బారెల్స్ పెట్రోలియంను ప్రాసెస్ చేస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన సొంత కార్యకలాపాల కోసం 45 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేసినట్లు బ్లూమ్ బెర్గ్ లెక్కలు చెబుతున్నాయి. ముఖేష్ ఆస్థి మొత్తంలో 60 శాతం ముడి చమురు ఉత్పత్తుల ద్వారా వచ్చిన సంపదే. కాబట్టే ఆర్ధిక వేత్తలు సైతం జామ్ నగర్ చమురు ఉత్పత్తి కేంద్రం ముఖేష్ అంబానీకి మనీ మేకింగ్ మిషన్ లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. 10శాతం తగ్గుతుందేమో! ప్రపంచం మొత్తం పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముఖేష్ అంబానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పాటు గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టినా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీ, పన్నులు, తరుగుదల, తీసుకున్న రుణాల్ని తీర్చినా రిలయన్స్ ఆదాయంలో 10% మాత్రమే ఖర్చవుతుందని, ఆయిల్-టు-కెమికల్స్ ప్రాసెస్ తో వచ్చే ఆదాయం 33 శాతం ఉంటుందని శాన్ఫోర్డ్ ఎనలిస్ట్ సి. బెర్న్‌స్టెయిన్ అంచనా వేశారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమణ మాట్లాడుతూ..జామ్ నగర్ చమురు శుద్ధి కేంద్రాల వల్ల పర్యావరణానికి ప్రమాదమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడుల కోసం చేపట్టే ఉత్పత్తుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సంకేతాలు వెలువడుతున్నా ముఖేష్ అంబానీ పట్టించుకోవడం లేదని అన్నారు. అలా చేస్తే రిలయన్స్ కూకటి వేళ్లు కదిలే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు?! ఈ ఏడాది జూన్‌లో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మొబైల్ నెట్‌వర్క్‌లో జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో..రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్ ఎనర్జీ రంగంలో తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేకాదు మూడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చిన శిలాజ ఇంధనాల యుగం ఎక్కువ కాలం కొనసాగదంటూనే.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాబట్టే ఈ గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ చమురు ఉత్పత్తులు తగ్గి రిలయన్స్ కూకటివేళ్లు కదిలే పరిస్థితి ఎదురైనా.. ముఖేష్ అంబానీ కుబేరుడి స్థానానికి వచ్చిన ఢోకా ఏం లేదని జోస్యం చెబుతున్నారు. చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
సౌదీ చమురు పెత్తనానికి చెక్!
న్యూఢిల్లీ: చమురు విషయంలో సౌదీ అరేబియా పెత్తనానికి చెక్ చెప్పే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా క్రూడాయిల్ కొనుగోళ్ల కోసం ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వ రంగ రిఫైనరీలను ఆదేశించింది. నిబంధనలు తమకు అనుకూలంగా ఉండే విధంగా చర్చలు జరపాలని ప్రభుత్వం సూచించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మధ్యప్రాచ్య ప్రాంతం కాకుండా ఇతరత్రా దేశాల నుంచి కూడా చమురు కొనుగోళ్లు జరిపే అవకాశాలను అన్వేషించాలంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)కి కేంద్రం సూచించినట్లు వివరించారు. ఉమ్మడిగా బేరసారాలు జరపడం ద్వారా భారత్‌కు ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చమురు ఉత్పత్తి కోత విషయంలో సౌదీ అరేబియాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు ధరలు ఫిబ్రవరిలో పెరగడం మొదలైనప్పడు.. నియంత్రణలను సడలించుకుని ఉత్పత్తి పెంచడం ద్వారా రేట్లు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలంటూ సౌదీ అరేబియాను భారత్ కోరింది. అయితే, దీన్ని సౌదీ పట్టించుకోలేదు. పైగా రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కున్న చమురును వాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీనితో చమురు అవసరాల కోసం మధ్యప్రాచ్యంపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన భారత్.. ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మొదలుపెట్టింది. ఎగుమతి దేశాల కుమ్మక్కు.. సింహభాగం చమురు అవసరాల కోసం భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. 85% పైగా చమురును దిగుమతి చేసుకుంటోంది. ‘సాధారణంగా సౌదీ అరేబియా, చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) నుంచే భారత్ ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతోంది. అయితే, వాటి నిబంధనలు కొనుగోలుదార్లకు ప్రతికూలంగా ఉంటున్నాయి‘ అని అధికారి వివరించారు. భారతీయ కంపెనీలు మూడింట రెండొంతుల కొనుగోళ్లు స్థిరమైన వార్షిక కాంట్రాక్టుల ఆధారంగా జరుపుతుంటాయి. వీటి వల్ల సరఫరాకు కచ్చితమైన హామీ ఉంటున్నప్పటికీ, ధరలు.. ఇతరత్రా నిబంధనలు మాత్రం సరఫరాదారు దేశాలకే అనుకూలంగా ఉంటున్నాయి. ‘కాంట్రాక్టులో కుదుర్చుకున్న మొత్తం పరిమాణాన్ని కొనుగోలుదారులు కొనాల్సిందే. అయితే, ఒపెక్ కూటమి గానీ రేట్లను పెంచుకునేందుకు ఉత్పత్తి తగ్గించుకోవాలనుకుంటే ఆ మేరకు సరఫరాలను తగ్గించేసేలా సౌదీ సహా ఇతర ఉత్పత్తి దేశాలకు అనుకూలంగా నిబంధనలు ఉంటున్నాయి. ఒపెక్ నిర్ణయాలకు వినియోగదారులెందుకు మూల్యం చెల్లించాలి? ఇంత పరిమాణం కొనుక్కుంటా మంటూ కుదుర్చుకున్న ఒప్పందానికి కొనుగోలుదారులు ఎలా కట్టుబడి ఉంటున్నారో.. సరఫరాపై ఉత్పత్తి దేశాలు కూడా కాంట్రాక్టుకు కట్టుబడి ఉండాలి కదా‘ అని అధికారి వ్యాఖ్యానించారు. సరఫరా మాత్రమే కాకుండా రేట్ల విషయంలోనూ ఆ దేశాలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వార్షిక టర్మ్ కాంట్రాక్టుకు మించి చమురు కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలుదారులు కనీసం 6 వారాల ముందుగా తెలియజేయాల్సి ఉంటోందని, ఉత్పత్తి దేశం ప్రకటించిన సగటు అధికారిక రేటునే చెల్లించాల్సివస్తోందని వివరించారు. ‘సాధారణంగా లోడింగ్ జరిగిన రోజున ఏ రేటు ఉందో అదే ధరను తీసుకోవాలి. తద్వారా అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు కొనుక్కుంటే కొనుగోలుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సౌదీ, ఇతర ఒపెక్ దేశాలు మాత్రం అవి నిర్దేశించే అధికారిక రేటే చెల్లించాలని పట్టుబడుతుంటాయి‘ అని అధికారి చెప్పారు. వ్యూహం ఇలా.. ప్రస్తుతం దేశీ రిఫైనింగ్ సంస్థలు ఎక్కువగా వార్షిక టర్మ్ కాంట్రాక్టుల ద్వారా చమురు కొనుగోళ్లు జరుపుతున్నాయి. కొత్త వ్యూహం ప్రకారం నెమ్మదిగా టర్మ్ కాంట్రాక్టుల వాటాను తగ్గించుకుంటూ స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోళ్లను పెంచుకునే అంశంపై దృష్టి పెట్టనున్నాయి. ధరలు ఎప్పుడు తగ్గితే అప్పుడు భారీగా కొనుక్కునేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ధరలపరమైన వెసులుబాటుతో పాటు ఏ కారణంతోనైనా ఉత్పత్తి పడిపోయినా సరఫరా కచ్చితంగా ఉండే రకంగా కాంట్రా క్టులు ఉండాలని కోరుకుంటున్నాం‘ అని అధికారి తెలిపారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు భారత్ చమురు కొనుక్కుంటుందని పేర్కొన్నారు. ‘ఎప్పుడు కావాలి, ఎంత కావాలి (కొనుగోలు పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వెసులుబాటు) అనేది ఎప్పుడైనా నిర్ణయించుకునే హక్కుతో పాటు కచ్చితమైన సరఫరా కోసం హామీ ఉండాలని భావిస్తున్నాం‘ అని వివరించారు. దేశీ రిఫైనర్లు దశాబ్దం క్రితం మొత్తం క్రూడ్ కొనుగోళ్లలో 20% చమురును స్పాట్ మార్కెట్లో కొంటుండగా.. ప్రస్తుతం దీన్ని 30–35%కి పెంచుకున్నాయి. -
కంపెనీలకు చమురు సెగ
కోవిడ్–19 సృష్టించిన విలయం నుంచి నెమ్మదిగా బయటపడుతున్న ప్రపంచ దేశాలు ఆర్థిక రికవరీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇటీవల బాండ్ల ఈల్డ్స్, డాలరు ఇండెక్స్ పుంజుకుంటోంది. మరోవైపు ముడిచమురు ధరలు సైతం బలపడుతున్నాయి. ఫలితంగా చమురు ఉత్పత్తి దేశాలు, కంపెనీలు లాభపడనుండగా.. దేశీయంగా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో పలు రంగాల కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ముంబై: కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. తాజాగా విదేశీ మార్కెట్లో 14 నెలల గరిష్టానికి చేరాయి. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు, లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ ధరలు పెరగడంతో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలు సైతం వేడిని పుట్టించనున్నాయి. నైమెక్స్ బ్యారల్ దాదాపు 66 డాలర్లకు చేరగా.. బ్రెంట్ 69 డాలర్లను అధిగమించింది. దీంతో దేశీయంగా పలు రంగాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే చమురును ఉత్పత్తి చేయగల అప్‌స్ట్రీమ్ కంపెనీలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కెయిర్న్, ఆర్ఐఎల్ లబ్ధి పొందే వీలుంది. అంతర్జాతీయ మార్కెట్ల ధరల ఆధారంగా ముడిచమురును విక్రయించేందుకు వీలుండటమే దీనికి కారణంకాగా.. చమురు శుద్ధి(రిఫైనింగ్) కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడనుంది. ఇదేవిధంగా ముడిచమురు నుంచి లభించే పలు డెరివేటివ్స్ ధరలు పెరగడంతో పెయింట్లు, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, కెమికల్స్ తదితర రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలుంది. చమురు జోరు ప్రపంచ ఆర్థిక రికవరీ, ఉత్పత్తిలో కోతల ఎత్తివేత తదితర అంచనాలతో ఈ ఏడాది రెండు నెలల్లోనే బ్రెంట్ చమురు 30 శాతం జంప్‌చేసింది. అయితే గత మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న చమురు ధరలతో దేశీయంగా లబ్ధి పొందుతూ వచ్చిన పలు రంగాలు దీంతో మార్జిన్ల సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. చమురు డెరివేటివ్స్‌ను పెయింట్స్, టైర్ల తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. పెయింట్స్, టైర్ల తయారీ ముడివ్యయాలలో 40–60 శాతం వాటాను ఇవి ఆక్రమిస్తుంటాయి. ఈ బాటలో ఎఫ్ఎంసీజీ, కెమికల్స్, సిమెంట్ తదితర రంగాలలోనూ చమురు డెరివేటివ్స్ కీలకపాత్ర పోషిస్తుంటాయి. చమురు ధరలు మండితే.. ఏటీఎఫ్ ధరలకు రెక్కలొస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా విమానయాన రంగంపై భారీగా భారం పడుతుంది. వెరసి ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంట
న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు బలపడి రూ. 83.13కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్‌కు 25 పైసలు అధికమై రూ. 73.32ను తాకింది. ఈ బాటలో కోల్‌కతాలో డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 76.89కు చేరగా.. పెట్రోల్ రేటు రూ. 84.63ను తాకింది. ముంబైలో డీజిల్ లీటర్ రూ. 79.93గా, పెట్రోల్ రూ. 89.78గా నమోదయ్యాయి. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 86కు చేరగా.. డీజిల్ రూ. 78.69 అయ్యింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. కాగా.. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. కోతల ఎఫెక్ట్ తాజా సమావేశంలో భాగంగా రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగాయి. వెరసి శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసింది. 49.25 డాలర్లను తాకింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు సైతం 1.4 శాతం జంప్‌చేసి 46.26 డాలర్లకు చేరింది. ఒపెక్ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7.2 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. దేశీయంగా విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
చమురు ఉత్పత్తి కోతకు డీల్...
లండన్: డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ముడిచమురు ఉత్పత్తి దేశాలు అసాధారణ చర్యలు తీసుకుంటున్నాయి. రేట్ల పతనానికి అడ్డు కట్ట వేసే దిశగా ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఉత్పత్తి దేశాలన్నీ దీనిపై ఒక అంగీకారానికి వచ్చినట్లు సుదీర్ఘంగా సాగిన వర్చువల్ సమావేశం అనంతరం పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోనున్నాయి. ఆ తర్వాత నుంచి డిసెంబర్ దాకా 8 మిలియన్ బీపీడీకి, 2021 నుంచి 16 నెలల పాటు 6 మిలియన్ బీపీడీకి పరిమితం చేయనున్నాయి. తొలుత ఈ డీల్‌కు ఒప్పుకోకపోయినప్పటికీ ఉత్పత్తి కోతతో తమకు వాటిల్లే నష్టాలను భర్తీ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇవ్వడంతో మెక్సికో కూడా అంగీకారం తెలిపింది. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలను పరిశీలిస్తున్నాయి. తాజా డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడవచ్చని విశ్లేషకుల అంచనా. ఇటు పరిమాణంపరంగాను, అటు ఉత్పత్తి కోతలో భాగమవుతున్న దేశాల సంఖ్యాపరంగాను ఇది అసాధారణమని తెలిపారు. ఇంధన రంగంలో బద్ధవిరోధులైన దేశాలు కూడా ఇందులో పాలు పంచుకోవడం విశేషమని పేర్కొన్నారు. ఇది సరిపోదు.. అయితే, భారీగా పడిపోయిన క్రూడాయిల్ డిమాండ్‌పరమైన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రతిపాదిత కోతలేమీ సరిపోయే అవకాశాలు లేవని విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయాయని, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని అంచనా. ఏప్రిల్‌లో సరఫరా, డిమాండ్ మధ్య 27.4 మిలియన్ బీపీడీ స్థాయిలో అసమతౌల్యత ఉంటుందని రీసెర్చ్ సంస్థ రైస్టాడ్ ఎనర్జీ అంచనా. డిమాండ్‌కి మించి సరఫరా! కరోనా వైరస్ వ్యాప్తితో చమురు డిమాండ్, ధరలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ఉత్పత్తి తగ్గించుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, దీని వల్ల అమెరికన్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో, తన మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు రష్యా అంగీకరించలేదు. ఇది సౌదీ అరేబియాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉత్పత్తిని భారీగా పెంచేసి రేట్లను తగ్గించేయడం ద్వారా ధరలపరమైన పోరుకు తెరతీసింది. అప్పట్నుంచి రేట్ల పతనం మొదలైంది. రేట్లు పడిపోవడంతో చాలా దేశాలు చౌకగా చమురు కొనుగోళ్లకు ఎగబడి నిల్వ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీలో సగటున 79 శాతం దాకా నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 2020లో గరిష్ట.. కనిష్టాలు... నిజానికి 2020 తొలి మూడు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీ ఎగువ, దిగువ స్థితులను చూడ్డం గమనార్హం. అంతక్రితం మూడు నెలల నుంచీ క్రూడ్ ధర అప్‌ట్రెండ్‌లోనే ఉంది. జనవరిలో అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, ఆ తర్వాత భౌగోళిక ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకోవడంతో ముడిచమురు రేటు ఒక్కసారిగా ఎగిసింది. అప్పటికి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ వెంటనే.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, క్రూడ్ ఉత్పత్తికి భయంలేదన్న సంకేతాలు.. తత్సబంధ పరిణామా లతో క్రమంగా చల్లారింది. అటు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో క్రూడ్ ధర మరికొంత చల్లారగా, రష్యా–సౌదీ అరేబియాల మధ్య మార్చి మొదటి వారంలో చోటుచేసుకున్న ‘ధరల యుద్ధం’తో 19 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. ఈ మూడు నెలల కాలంలో ధరల పరిస్థితిని చూస్తే, అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 66.6–19.27 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను చూడగా, బ్రెంట్ క్రూడ్ ధర 75.6–21.65 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిల్లో తిరుగాడాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు రోజు కాగా, గురువారం ట్రేడింగ్‌లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర 23.21 డాలర్ల వద్ద ముగియగా, బ్రెంట్ 31.82 డాలర్ల వద్ద ఉంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సందర్భంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పెట్రో కంపెనీలకు క్రూడ్ సెగ
ముంబై: ముడి చమురు ధరలు భగ్గుమంటుండటంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) లాభదాయకతకు చిల్లుపడే అవకాశాలు కనిపిసున్నాయి. భారత్ తన అవసరాలకు భారీగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ధర బుధవారం రాత్రి 9.30 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా బ్యారెల్ 67.50 డాలర్ల స్థాయికి చేరింది. 2016 చివరి నాటికి బ్యారెల్ ధర 48 డాలర్ల స్థాయిలో ఉండేది. అంటే గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 40 శాతానికిపైగా పెరిగింది. ధరలెందుకు పెరుగుతున్నాయంటే... ►అమెరికాలో సంభవించిన ‘ఇర్మా’ హరికేన్‌తో రిఫైనరీలు కొన్నాళ్లు మూతబడ్డాయి. కానీ తుఫాను ప్రభావం తగ్గడంతో రిఫైనరీలన్నీ తెరుచుకుని ఒక్కసారిగా క్రూడ్‌కు డిమాండ్ పెరిగింది. ►దాదాపు ఇదే సమయంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కోతను పొడిగించాలని ఒపెక్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మరింత భారీ పెరుగుదలకు దారితీసింది. ►డాలర్ ఇండెక్స్ బలహీనత కూడా క్రూడ్ ధరల పెరుగుదలకు కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. డాలర్ తగ్గుదల వల్ల చమురు ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గుతాయి. ►ఇక ఉత్తరకొరియా, ఇరాక్ దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రికత్తలు చమురు మంటకు ఆజ్యం పోశాయి. ►ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మెరుగుపడుతున్న ధోరణి కూడా ముడి చమురుకు డిమాండ్‌ను పెంచింది. ►వీటన్నింటికీ తోడు కొన్ని దేశాల్లో పైపులైన్లు పేలుళ్లు, అంతర్గత ఉద్రిక్తతల వంటి అంశాలు చమురు ధరలను పెంచాయి. దేశీయ ఓఎంసీలపై ప్రభావం... బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ గడచిన 3 నెలల్లో 9.71% పెరిగింది. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సూచీ 8.86 శాతం ఎగసింది. కానీ బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఐఓసీ షేర్ 3 శాతం, హెచ్‌పీసీఎల్ షేర్ 2.5 శాతం తగ్గింది. అయితే గెయిల్ కొనుగోలు వార్తలతో బీపీసీఎల్ 10% పెరిగింది. పడిపోతున్న మార్జిన్లు...రక్షిస్తున్న రూపాయి నిజానికి క్రూడ్ ధరలు పెరగటం వల్ల చమురు కంపెనీల మార్జిన్లు గణనీయంగా పడిపోతున్నాయి. రూపాయి బాగా బలపడటం వీటిని కొంతవరకూ ఆదుకున్నదనే చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో డీజిల్, పెట్రోల్‌పై మార్కెటింగ్ మార్జిన్ లీటరుకు 3.10 పైసలు ఉంటే, ప్రస్తుతం ఇది రూపాయికి పడింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, దీనికనుగుణంగా దేశీయంగా ధరలు పెంచకపోవడం దీనికి కారణమనేది కంపెనీల మాట. అయితే, అం తర్జాతీయంగా ధరలు తగ్గినపుడు దేశీయంగా తగ్గలేదన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కష్టకాలమే..! క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల చమురు మార్కెటింగ్ కంపెనీల రోజూవారీ వ్యయ అవసరాలను పెంచుతుంది. దీనికితోడు స్వల్పకాలిక రుణ స్థాయిలపై సైతం ఇది ప్రభావం చూపుతుంది. భారత ఎంసీఏల లాభదాయకతపై ఇది ప్రభావం చూపుతుంది. స్థూల అండర్ రికవరీలల్లో నుంచి కేటాయింపులు జరుపుకోవాలని ప్రభుత్వ రంగంలోని ఓఎంసీలకు ఆదేశాలు జారీ అయినా... అదీ ఆయా కంపెనీల లాభదాయకతకు దెబ్బే. ఇక మార్కెట్ నిర్ధారిత స్థాయిల వద్ద ఆటో ఫ్యూయెల్స్ ధరలను కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికీ తాజా పరిస్థితి పరీక్ష వంటిదే. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ధర పెంచితే, దేశంలో అన్ని స్థాయిల్లో ధరల పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుంది. ఇక దేశీయంగా ఆర్థిక అంశాలను చూస్తే, 2016–17తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) రెట్టింపయ్యే అవకాశం ఉంది. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) క్యాడ్ 1.5%కి చేరే వీలుంది. – కె.రవిచంద్రన్, ఇక్రా ముడి చమురు ధరలు పెరిగితే చమురు కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు తగ్గుతాయి. మూలధన ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నగదు నిల్వలు హరించుకుపోతాయి. ఈ కంపెనీల షేర్ల అవుట్‌లుక్ పెద్దగా ఆశావహంగా కూడా ఏమీ లేదు. – కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ -
పెట్రోలియం డీలర్ల నిరసన విరమణ
-
పెట్రోలియం డీలర్ల నిరసన విరమణ
⇒ చమురు కంపెనీలతో డీలర్ల చర్చలు సఫలం ⇒ఓఎంసీ, సీఐపీడీ, ఏఐపీడీఏ మధ్య ఒప్పందం ⇒యథావిధిగా బంకుల నిర్వహణ సాక్షి, హైదరాబాద్: కమీషన్ పెంపు వ్యవహరంపై చమురు కంపెనీలకు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య నెలకొన్న వివాదానికి తెరపడినట్లరుుంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించి కమీషన్ పెంపునకు చమురు సంస్థలు అంగీకరించడంతో తాము చేపట్టదలచిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీ.వినయ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం ముంబైలో చమురు కంపెనీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకు ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ సింగిల్ షిఫ్ట్ విధానంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు సాగిస్తామని, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ బంకులు మూసేస్తామని తీవ్ర నిర్ణయాలను పెట్రోలియం డీలర్లు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో వారు తమ నిర్ణయాలను ఉపసంహరించుకున్నారు. కుదిరిన ఒప్పందం.. డీలర్ల మార్జిన్ పెంపు విషయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు, కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ), ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్(ఏఐపీడీఏ) మధ్య ఒప్పందం కుదిరింది. మోటర్ స్పిరిట్ కిలో లీటర్‌కు రూ.138, హైస్పీడ్ డీజిల్ కిలో లీటర్‌కు రూ.102ను డీలర్ మార్జిన్ కింద పెంచేందుకు అంగీకారం కుదిరింది. ఈ పెంపును నవంబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఓఎంసీ, సీఐపీడీ, ఏఐపీడీఏ సభ్యుల సంయుక్త కమిటీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ సంయుక్త కమిటీ డీలర్ రెమ్యునరేషన్, గతంలో జరిగిన తప్పుల పరిశీలనను నవంబర్ 15 కల్లా పూర్తి చేసి తగిన సిఫారసులు చేస్తుంది. కొత్త డీలర్ రెమ్యునరేషన్‌ను తదుపరి డీలర్ మార్జిన్ పెంపు సమయంలో అమలు చేస్తారు. ప్రతీ ఆరు నెలలకొకసారి అంటే జనవరి 1, జూలై 1న డీలర్ మార్జిన్‌ను సవరించడం జరుగుతుంది. సవరించిన ఎన్ఎఫ్ఏ రిపోర్ట్‌ను నవంబర్ 30లోపు ఖరారు చేస్తారు. తదుపరి డీలర్ మార్జిన్ సవరణ సమయంలో ఈ రిపోర్ట్‌ను అమలు చేస్తారు. సిబ్బంది అధ్యయనాన్ని బయట ఏజెన్సీ చేత డిసెంబర్ 31 నాటికి ప్రారంభిస్తారు. హైస్పీడ్ డీజిల్ నష్టాల నివేదికను ఈ నెలాఖరుకల్లా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి తెప్పించుకోవాలని నిర్ణయించారు. ఆ సంస్థ సిఫారసులను వచ్చే డీలర్ కమిషన్ సవరణ సమయంలో అమలు చేయాలని కూడా నిర్ణరుుంచారు. మోటర్ స్పిరిట్ నష్టాలపై అధ్యయనాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి చేపట్టి 2018 జనవరి 1 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.