
న్యూఢిల్లీ: ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విమాన ఇంధనంగా పిలిచే ఏటీఎఫ్‌పై డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించిన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా తగ్గింపు అక్టోబరు 11 (గురువారం) నుంచి అమల్లోకి రానుంది.
ప్రస్తుతం ఢిల్లీలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.74.56 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది జులై నుంచి ఇప్పటివరకు విమాన ఇంధన ధర 58.6 శాతం పెరిగింది.