న్యూఢిల్లీ: విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) నష్టాలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మరింత పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.1,194 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా.. అవి మరింత అధికమై రూ.1,435 కోట్లకు చేరాయి. ఈ సంస్థ నిర్వహణలో 219 విమానాలు ఉన్నాయి. మొత్తం ఆదాయం 91 శాతం వృద్ధితో రూ.5,798 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. వ్యయాలు 71 శాతం అధికమై రూ.7,234 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఆదాయంలో వృద్ధి ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాలన్స్‌షీటును బలోపేతం చేసుకోవడంలో భాగంగా తిరిగి లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాం’’ అని కంపెనీ సీఈవో రోనోజోయ్‌దత్తా తెలిపారు. ఏవియేషన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. వీటి కారణంగా వ్యయాలు మరింత అధికమవుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment