సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈనెల 19వ తేదీన గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పౌర విమాన రంగంలో మన దేశం ప్రపంచంలో 14వ స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. నీటిలో, గాలిలో ప్రయాణించగలిగిన సీ ప్లేన్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. 👉🏿అమరావతిలో కూడా సీప్లేన్ ప్రదర్శన చేయాలని స్పైస్ జెట్ సీఎండీని కోరానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment