మరో రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు | Two more international flights services: Telangana | Sakshi
Sakshi News home page

మరో రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు

Jan 24 2025 5:41 AM | Updated on Jan 24 2025 5:41 AM

Two more international flights services: Telangana

వియత్నాం హో చిమిన్హ్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాలు

శంషాబాద్‌ (హైదరాబాద్‌): హైదరాబాద్‌ నుంచి మరో రెండు అంతర్జాతీయ గమ్యస్థానాలకు త్వరలోనే విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. వియత్నాంలోని చిమిన్హ్‌ నగరం నుంచి.. హైదరాబాద్‌కు వారంలో రెండు విమాన సర్వీసులు నడపనున్నట్లు వీయెట్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. మార్చి 18 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. 

హైదరాబాద్‌ నుంచి మంగళ, శనివారాల్లో ఈ సర్వీసులుంటాయి. దీంతో పాటు బెంగళూరు నగరం నుంచి కూడా హో చిమిన్హ్‌ నగరానికి కూడా సోమ, బుధవారాల్లో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ సమయంలో విమాన ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కూడా ప్రకటించింది. 

ఫుకెట్‌కు నేరుగా..: ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కూడా.. త్వరలోనే హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వీటికి సంబంధించిన బుకింగ్‌లు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement