న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. కరోనా మూడో దశకు వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. మార్చి 22 నుంచి వారం రోజులపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 65 ఏళ్లకు పైబడినవారు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది. పౌరవిమానయాన, రైల్వేల్లో పాసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారం పాటు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నట్టు పేర్కొంది. అత్యవసర సర్వీసులు మినహా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కోరింది.
మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు భారత్‌లో 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో కరోనా సోకిన వృద్ధుడు గురువారం మరణించడంతో.. భారత్‌లో వైరస్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
చదవండి : భారత్‌లో మరో ‘కరోనా’ మరణం
Comments
Please login to add a commentAdd a comment