అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తుంది.
ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని Directorate General of Civil Aviation తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్‌మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అంతకు ముందు మార్చి 29, 2020 కరోనా టైం నుంచి చాలావరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకు రద్దు అయ్యాయి. కాకపోతే వందేమాతం మిషన్ లాంటి కొన్ని సర్వీసులను ‘ఎయిర్ బబూల్’ అరేంజ్‌మెంట్స్‌తో ఎంపిక చేసిన దేశాలకు జులై 2020 వరకు నడిపించారు. యూఎస్, యూకే, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్‌తో పాటు మొత్తం 32 దేశాలకు ఎయిర్‌బబూల్ అగ్రిమెంట్ ద్వారా విమానాలు నడిపిస్తోంది భారత్.
— DGCA (@DGCAIndia) January 19, 2022
పునరుద్ధరణపై వెనక్కి..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానాలన్నింటిని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఇంతలోనే వేరియెంట్లు, కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment