ban extended
-
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అలర్ట్
అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని Directorate General of Civil Aviation తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి 29, 2020 కరోనా టైం నుంచి చాలావరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకు రద్దు అయ్యాయి. కాకపోతే వందేమాతం మిషన్ లాంటి కొన్ని సర్వీసులను ‘ఎయిర్ బబూల్’ అరేంజ్మెంట్స్తో ఎంపిక చేసిన దేశాలకు జులై 2020 వరకు నడిపించారు. యూఎస్, యూకే, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్‌తో పాటు మొత్తం 32 దేశాలకు ఎయిర్బబూల్ అగ్రిమెంట్ ద్వారా విమానాలు నడిపిస్తోంది భారత్. pic.twitter.com/5KCcDlZHMX — DGCA (@DGCAIndia) January 19, 2022 పునరుద్ధరణపై వెనక్కి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానాలన్నింటిని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఇంతలోనే వేరియెంట్లు, కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది. -
అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల వివనాలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. అయితే, కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో రద్దును జూలై 31వ తేదీ దాకా పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) బుధవారం వెల్లడించారు. అయితే, ఎంపిక చేసిన వర్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాల రాకపోకలను అనుమతించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ కార్గో విమానాల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికుల వివన సేవలను ప్రభుత్వం 2020 మార్చి నుంచి రద్దు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్ కింద 2020 మే నుంచి ప్రత్యేక అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను అనుమతిస్తోంది. చదవండి: పిల్లలపై కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు నో -
భారతీయ టెకీలకు ట్రంప్ మరోసారి షాక్!
వాషింగ్టన్: వైట్‌హౌస్ వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ టెక్కీలకు మళ్లీ షాక్ ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు, హెచ్–1బీతో పాటుగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఆధారిత వీసాలపై నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగించారు. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి వీటిపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యంలో గత ఏడాది జూన్‌లో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అన్ని రకాల వీసాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లో నిషేధం గడువు ముగుస్తుందనగా గురువారం పొడిగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్–1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ వలసదారుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ టెకీలకు తీవ్ర ఎదురు దెబ్బ తగలనుంది. డాలర్ డ్రీమ్స్ కలల్ని నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్లాలంటే భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన వారు మరో మూడు నెలలవరకు ఎదురు చూడాల్సిందే. అమెరికా కంపెనీలకు 10 వేల కోట్ల నష్టం ! ట్రంప్ వీసా విధానంపై అమెరికాలోనూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌లో ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో 500 టెక్ కంపెనీలకు 10వేల కోట్ల డాలర్లు నష్టం కలిగినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సారి నిషేధం పొడిగింపు వల్ల పెద్దగా నష్టం జరగదని, బైడెన్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశాక వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో 6.7శాతం ఉన్నందుకే నిషేధాన్ని పొడిగించానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. -
గుట్కా, పాన్ మసాలలపై నిషేధం పొడిగింపు
విజయవాడ: ప్రజల ఆరోగ్యానికి చేటుచేసే పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్ మసాలలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆయా ఉత్పత్తుల వినియోగం, తయారీలపై ఉన్న నిషేధం జనవరి 10 నాటికి ముగుస్తుండటంతో ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులు ఆహార భద్రతా,ప్రమాణాల చట్టం ప్రకారం ..పొగాకు ఉత్పత్తులు, నిల్వలు, పంపిణీ, సరఫరాలు వంటి వాటిపై ఉన్న నిషేధాన్ని 10 జనవరి 2016 నుంచి 9 జనవరి 2017వరకు సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు ఆహార పరిరక్షణా విభాగం కమిషనర్ కె.వి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.