విజయవాడ: ప్రజల ఆరోగ్యానికి చేటుచేసే పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్ మసాలలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆయా ఉత్పత్తుల వినియోగం, తయారీలపై ఉన్న నిషేధం జనవరి 10 నాటికి ముగుస్తుండటంతో ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులు
ఆహార భద్రతా,ప్రమాణాల చట్టం ప్రకారం ..పొగాకు ఉత్పత్తులు, నిల్వలు, పంపిణీ, సరఫరాలు వంటి వాటిపై ఉన్న నిషేధాన్ని 10 జనవరి 2016 నుంచి 9 జనవరి 2017వరకు సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు ఆహార పరిరక్షణా విభాగం కమిషనర్ కె.వి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గుట్కా, పాన్ మసాలలపై నిషేధం పొడిగింపు
Published Tue, Jan 5 2016 9:00 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM
Advertisement
Advertisement