గుట్కా, పాన్ మసాలాపై ఢిల్లీ సర్కార్ బ్యాన్
న్యూఢిల్లీ : ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే గుట్కా, పాన్ మసాలా, పొగాకు సంబంధిత పదార్థాల ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుట్కా, పాన్ మసాలాలతో పాటు ఖైనీ, జర్దా పాన్లపై కూడా నిషేధం కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం నేటి నుంచి అమల్లోకి రానుంది.
ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. కాగా ఫుడ్‌సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం గుట్కాలు, పాన మసాలాలతోపాటు చాప్‌టొబాకో, ఖైనీ, ఖరా, టొబాకో ఫ్లేవర్డ్ మసాలాల తయారీ, అమ్మకాలు, నిల్వ ఈ చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.