delhi governement
-
కొత్త ఏడాదికి ముందే మరిన్ని మద్యం దుకాణాలు
న్యూఢిల్లీ: రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరానికి ముందే ప్రీమియం మద్యం షాపులను తెరవాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం నూతనంగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలు 500 చదరపు మీటర్ల కంటే అధిక విస్తీర్ణంలో ఉండనున్నాయి. వినియోగదారులు దుకాణంలోని షెల్ఫ్ నుండి తమకు ఇష్టమైన బ్రాండ్‌ను ఎంచుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ నూతన ప్రీమియం స్టోర్లు.. మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఏర్పాటుకానున్నాయి. ఢిల్లీలోని నాలుగు కార్పొరేషన్లు ఈ దుకాణాలను ఏర్పాటు చేయనున్నాయి.నూతనంగా ఈ ప్రీమియం దుకాణాలను తెరవడం వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై సుంకం ద్వారా రూ.3,047 కోట్లు ఆర్జించగా, గత ఏడాది ఇదే కాలంలో రూ.2,849 కోట్లు ఆర్జించింది.ఇది కూడా చదవండి: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై లిచ్ట్‌మన్ జోస్యం వైరల్ -
కుంటి సాకులు చెప్పొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడంలో అత్యవసర చర్యలు తీసుకోనందుకు, మున్సిపల్ కార్పొరేషన్లపై నెపం వేసేందుకు యత్నించినందుకు ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంటి సాకులు చెబితే ఆదాయం, పాపులారిటీ స్లోగన్ల ఖర్చులపై ఆడిట్‌కు ఆదేశిస్తామని ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం రైతులు పంట వ్యర్థాలు దహనం చేయడం వల్ల కాదని నిర్ధారణకు వచ్చింది. ప్రతివాదుల అఫిడవిట్ల పరిశీలన తర్వాత వాయుకాలుష్యానికి నిర్మాణ కార్యకలాపాలు, పరిశ్రమలు, రవాణా, వాహనాల రాకపోకలతోపాటు అక్కడక్కడ పంట వ్యర్థాలు కాల్చడమనే నిర్ధారణకు వచ్చామని పేర్కొంది. ఎయిర్‌క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నియంత్రణ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కారకాల నియంత్రణకు ఏయే చర్యలు తీసుకోబోతున్నారో కచ్చితంగా సూచించలేదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో కొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పంజాబ్, యూపీ, హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మంగళవారం సమావేశం కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఢిల్లీకి చెందిన విద్యార్థి ఆదిత్య దూబే దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పంట వ్యర్థాలు కాల్చడానికి సంబంధించి పంజాబ్‌లో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరిపైనా కేసులు పెట్టడం లేదని పేర్కొన్నారు. భవన నిర్మాణాలను నిలుపుదల చేయలేదని తెలిపారు. సొలిసిటర్ జనరల్ అందజేసిన నివేదిక కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పార్కింగ్ రుసుము 4 రెట్లు పెంచాలని, బహిరంగంగా వ్యర్థాలు తగులబెట్టకుండా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేశారు. పంట వ్యర్థాల వల్ల వచ్చే కాలుష్యం ప్రధాన సమస్య కాదని అంగీకరిస్తున్నారా... ఢిల్లీకి రాకపోకలు మొత్తంగా నిషేధిస్తారా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. పరిశ్రమలు, రవాణా, దుమ్ము కారణంగానే 75 శాతం వాయు కాలుష్యం వస్తోందని అఫిడవిట్లో పేర్కొన్నారని ఆ దిశగా నియంత్రణ ఆలోచించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. బుధవారానికల్లా ఏయే చర్యలు తీసుకున్నారో తెలపాలని సూచించారు. -
కరోనా: కేజ్రీవాల్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల నేపథ్యంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ పరీక్షల్లో అధికంగా తప్పుడు ఫలితాలు వెల్లడవుతున్నప్పటికీ ఇంకా రాపిడ్ టెస్టులనే ఎందుకు నిర్వహిస్తున్నారని ఢిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేగాక కరోనా పరీక్షల విధి విధానాల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. అంతేగాని తమ సొంత నిర్ణయాలను కాదని స్పష్టం చేసింది. (ప్రియాంక గాంధీని డిన్నర్‌కు పిలిచిన బీజేపీ ఎంపీ ) దేశ రాజధానిలో నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) నిర్వహించిన సెరో సర్వేలో రాష్ట్రంలోని 22.86 శాతానికి పైగా ప్రజలు కరోనా బారిన పడినట్లు హైకోర్టు ప్రస్తావించింది. అలాగే వారికి లక్షణాలు లేకపోవడంతో బాధితులకు ఆ విషయం కూడా తెలియడం లేదని సూచించింది. ఇలాంటి పరిస్థితిల్లో ఢిల్లీ ప్రభుత్వం రాపిడ్ పరీక్షలతో ఎలా ముందుకు పోతుందని జస్టిస్ హిమా కోహ్లీ, సుబ్రమోనియం ప్రసాద్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. అంతేగాక వీటి ఫలితాల రేటు కూడా ఎక్కువగా తప్పుగా వెల్లడవడంతో ఇంకా ఎలా చేస్తున్నారని నిలదీసింది. ఈ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పలేదని తెలిపింది. కేవలం కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే రాపిడ్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేస్తోందని హైకోర్టు గుర్తు చేసింది. (కరోనా కల్లోలం: భారత్‌లో కొత్తగా 47,704 కేసులు) -
సర్కారుకు ఆటోవాలాల విజ్ఞప్తి!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఆటోడ్రైవర్లు, టాక్సీవాలాలు తీవ్రంగా నష్టపోయారు. అయితే లాక్డౌన్ 4.0 లో కొన్ని సడలింపులతో ఆటోలు, క్యాబ్‌లు నడుపుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కానీ ఆటోలో కేవలం ఒక్క ప్రయాణీకుడికి మాత్రమే అనుమతి ఉందని తెలిపింది. దీంతో కనీసం ఇద్దరు ప్రయాణీకులనయిన ఆటోలో అనుమతించాలని డ్రైవర్లలందరూ బుధవారం ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. (ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి) ఈ విషయం పై ఒక ఆటో డ్రైవర్ మాట్లాడుతూ ... ఒక్క ప్రయాణీకుడికే అనుమతిస్తే చాలా కష్టం అవుతుంది. ఫ్యామిలితో వెళ్లే వాళ్లు కనీసం ఇద్దరైనా వెళతారు. అటువంటి వారు పిల్లల్ని ఒంటరిగా ఒక ఆటోలో పెద్దలు ఒక ఆటోలో వెళ్లలేరు కదా. అందుకోసమే కేవలం ఇద్దరికైనా ఆటోలో ఎక్కేందుకు అనుమతినివ్వాలి అని కోరారు. ఇక ఆటోరిక్షా, ఈ- రిక్షా, సైకిల్ రిక్షాలో కేవలం ఒక్కరికి, ట్యాక్సీలో, క్యాబ్‌లో ఇద్దరికి, గ్రామీన్, ఫట్‌ఫట్, ఎకో ఫ్రెండ్లీ సేవలలో ఇద్దరికి, మ్యాక్సీ క్యాబ్‌లో ఐదుగురికి, ఆర్టీవీలలో 11 మంది ప్రయాణించడానికి ఢిల్లీ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు ప్రయాణీకుడు దిగగానే ఆ మొత్తం ప్రదేశాన్ని శానిటైజర్‌తో శుభ్రం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి) -
ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ముంబై తరహాలో ఢిల్లీలోనూ మీడియా ప్రతినిధులకు మూకుమ్మడిగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ట్వీట్ ద్వారా ఓ వ్యక్తి చేసిన విజ్ఞప్తికి ఆయన స్పందిస్తూ జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహించాలని బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కోరారు. వైద్య సిబ్బంది, పోలీసుల తరహాలో మీడియా సిబ్బంది సైతం మహమ్మారి వార్తలను ముందుండి చేరవేస్తున్నారని అన్నారు. కాగా ఏప్రిల్ 16, 17 తేదీల్లో ముంబై ఆజాద్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో 171 మంది ఎలక్ర్టానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధుల నుంచి బీఎంసీ అధికారులు నమూనాలను సేకరించారు. 171 మందిలో 53 మందికి కరోనా పాజిటివ్ పలితాలు వచ్చాయని, వారిలో చాలామందికి ఇప్పటివరకూ ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదని బీఎంసీ ప్రతనిధి విజయ్ కాంబ్లే వెల్లడించారు. చదవండి : వారి పరిస్థితి మరీ దుర్భరం -
గుట్కా, పాన్ మసాలాపై ఢిల్లీ సర్కార్ బ్యాన్
న్యూఢిల్లీ : ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే గుట్కా, పాన్ మసాలా, పొగాకు సంబంధిత పదార్థాల ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుట్కా, పాన్ మసాలాలతో పాటు ఖైనీ, జర్దా పాన్లపై కూడా నిషేధం కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. కాగా ఫుడ్‌సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం గుట్కాలు, పాన మసాలాలతోపాటు చాప్టొబాకో, ఖైనీ, ఖరా, టొబాకో ఫ్లేవర్డ్ మసాలాల తయారీ, అమ్మకాలు, నిల్వ ఈ చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.