సాక్షి, న్యూఢిల్లీ : ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ముంబై తరహాలో ఢిల్లీలోనూ మీడియా ప్రతినిధులకు మూకుమ్మడిగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ట్వీట్ ద్వారా ఓ వ్యక్తి చేసిన విజ్ఞప్తికి ఆయన స్పందిస్తూ జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహించాలని బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కోరారు.
వైద్య సిబ్బంది, పోలీసుల తరహాలో మీడియా సిబ్బంది సైతం మహమ్మారి వార్తలను ముందుండి చేరవేస్తున్నారని అన్నారు. కాగా ఏప్రిల్ 16, 17 తేదీల్లో ముంబై ఆజాద్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో 171 మంది ఎలక్ర్టానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధుల నుంచి బీఎంసీ అధికారులు నమూనాలను సేకరించారు. 171 మందిలో 53 మందికి కరోనా పాజిటివ్ పలితాలు వచ్చాయని, వారిలో చాలామందికి ఇప్పటివరకూ ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదని బీఎంసీ ప్రతనిధి విజయ్ కాంబ్లే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment