న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు విమానాల నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆది వారం తెలిపింది. కరోనా కారణంగా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే వందే భారత్ మిషన్‌తో పాటు, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కొనసాగుతోంది. తాజా నిషేధ పొడిగింపు కార్గో విమానాలకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment