
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సోమవారం వెల్లడించింది. అయితే సంబంధిత అధికార యంత్రాంగం ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయా దేశాలతో పరస్పర ఒప్పందాలతో పాటు వందే భారత్ మిషన్ కింద కొద్ది నెలలుగా ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను ప్రభుత్వం నడుపుతోంది.
ఇక కార్గో కార్యకలాపాలకు, డీజీసీఏ నిర్ధిష్టంగా అనుమతించిన విమానాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రకటన పేర్కొంది.అన్‌లాక్ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్కూళ్లు, విద్యాసంస్ధల మూసివేతను సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. మరోవైపు సినిమా థియేటర్లు, బార్లు తెరవడానికి మరికొంత సమయం పట్టనుండగా, కంటైన్‌మెంట్ జోన్లలలో ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి. చదవండి : అన్‌లాక్ 4.0 : మెట్రోకు గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment