న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 27 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కరోనా వ్యాప్తిని నివారించే లక్ష్యంతో 2020 మార్చి 23వ తేదీ నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సేవలను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేక ఏర్పాట్ల కింద 37 దేశాలకు జూలై 2020 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను మాత్రం కొనసాగిస్తోంది. మార్చి 27వ తేదీ నుంచి షెడ్యూల్డ్ విమాన సర్వీసులు మొదలయ్యాక ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా నడిచే విమాన సర్వీసులు రద్దవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ నిబంధనలను యథాప్రకారం అమలు చేస్తామన్నారు.
(చదవండి: న్యాయ చరిత్రలోనే అరుదైన సందర్భం...కేరళ హైకోర్టులో మహిళా ధర్మాసనం)
Comments
Please login to add a commentAdd a comment