
ట్రావెల్‌బ్యాన్: ట్రంప్‌కు మరోషాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మరోసారి చుక్కెదురైంది. ఏది ఏమైనా తాను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతానంటూ ఇటీవల ముస్లిం దేశాలనుంచి వలసల నిషేధ ఆర్డర్‌పై సంతకం చేసిన ట్రంప్‌కు అక్కడి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సవరించిన ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తేల్చి చెప్పింది. పేరుకు జాతీయ భద్రత లక్ష్యంగా ఉన్నప్పటికీ, మతపరమైన అసహనం, వివక్ష, వ్యతిరేక ధోరణి కనిపిస్తోందని గురువారం కోర్టు వ్యాఖ్యానించింది.
అమెరికా సర్క్యూట్ అప్పిలేట్ లోని 4వ సర్య్కూట్ కోర్టు ఈ తీర్పు చెప్పింది. ట్రంప్ ఆర్డర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘింస్తోందని పేర్కొంది. ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ల నుంచి ప్రజలకు వీసాలను నిషేధించడం రిపబ్లికన్ పరిపాలనను అడ్డుకుంటుందని తెలిపింది. ఈమేరకు కిందికోర్టు తీర్పును బలపరుస్తూ ట్రంప్ ఆర్డర్‌ను నిలిపివేసింది. అయితే ఈ తీర్పుపై ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని సమాచారం. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరనుంది.
కాగా ఈ ఏడాది జనవరి 27న ముందు ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై నిషేధం విధించగా తీవ్ర వ్యతిరేక రావడంతో ఆ జాబితా నుంచి ఇరాక్‌ను మినహాయించింది ట్రంప్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమన్ దేశాలపై బ్యాన్‌ను కంటిన్యూ చేస్తూ సవరించిన ఆర్డర్‌పై ట్ంప్ సంతకం చేశారు. మే 16 నుండి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.