
‘ట్రంప్.. మాపై నిషేధం ఎత్తివేయండి ప్లీజ్’
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. తమ దేశంపై విధించిన ట్రావెలింగ్ బ్యాన్ తొలగించాలని కోరారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కారణంగా అమాయకులైన తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్రంప్‌కు చెప్పారు. ఈ మేరకు ఇరాక్ అధికార ప్రతినిధి వివరాలు తెలియజేశారు. మొత్తం ఏడు ముస్లిం దేశాలపై అమెరికాలోకి అడుగుపెట్టకుండా ట్రావెలింగ్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో ఇరాక్ కూడా ఉంది. దీంతో ఈ నిర్ణయం నాటికి అమెరికా నుంచి ఇరాక్ వచ్చిన వారు.. అమెరికా వెళ్లాల్సిన వారికి చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన ట్రావెలింగ్ బ్యాన్ చెల్లదంటూ కిందిస్థాయి కోర్టు తొలుత అనంతరం ఫెడరల్ కోర్టు స్పష్టం చేయడంతో కొంత ఊరట కలిగినట్లయింది. ప్రస్తుతం కొన్ని దేశాల నుంచి అమెరికాలో అడుగుపెడుతున్నారు. అయితే, ఇప్పటికి కూడా ఆ ఏడు ముస్లిం దేశాల్లో ఏ దేశంపై కూడా ట్రంప్ పూర్తిగా వెనక్కి తగ్గకపోగా ఆ వ్యవహారం కోర్టులో ఉంది.
ఈ నేపథ్యంలోనే తమ దేశంపై ట్రావెల్ బ్యాన్ తొలగించాలని అబాదీ కోరారు. వాస్తవానికి ఇరాక్‌కు ఆర్ధికంగా, రాజకీయంగా, సైనిక రక్షణపరంగా ప్రపంచంలోనే అత్యధిక సహాయం అందుతుంది ఒక్క అమెరికా నుంచే. ఈ విషయాలు కూడా ట్రంప్‌కు అబాదీ గుర్తు చేసినట్లు తెలిసింది.
సంబంధిత వార్తలకై ఇక్కడ చదవండి
(ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!)
(‘నిషేధం’పై వెనక్కి!)
(డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!)
(ట్రంప్కు మరో గట్టి ఎదురు దెబ్బ!)