
అమెరికా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వానికి ఆ దేశ సుప్రీంకోర్టులో స్వల్ప ఎదురు దెబ్బ తగిలింది. వివాదాస్పద ప్రయాణ నిషేధ ఉత్తర్వులను అమెరికా పౌరుల తాత–బామ్మ–అమ్మమ్మ, మనవడు, మనవరాళ్లతో పాటు ఇతర సన్నిహిత సంబంధీకులకు ప్రస్తుతానికి వర్తింపచేయరాదని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
‘సన్నిహిత సంబంధం’పై ట్రంప్ ప్రభుత్వ నిర్వచనం విస్తృతంగా లేదని గతంలో హవాయ్ ఫెడరల్ జడ్జి డెర్రిక్ వాట్సన్ జారీచేసిన రూలింగ్‌తో ఏకీభవించింది. బుధవారం తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు...వాట్సన్ రూలింగ్‌లోని కొంత భాగంపై స్టే విధించింది. దీంతో 120 రోజుల పాటు శరణార్థులందరికీ ప్రయాణ నిషేధ ఉత్తర్వుల నుంచి మినహాయింపు లభిస్తుందేమోనన్న ట్రంప్ ప్రభుత్వ బెంగ తీరినట్లయింది.