
అబుదాబి: కరోనా నేపథ్యంలో యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 14 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. జులై 21 వరకు ట్రావెల్ బ్యాన్ నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటు కొన్ని ఆఫ్రికన్ దేశాలు.. మొత్తం 14 దేశాల ప్యాసింజర్ విమానాలకు జులై 21 వరకు అనుమతి ఉండదని యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. అదే టైంలో కార్గో ఫ్లైట్లు, ఛార్టెర్ ఫ్లైట్స్‌కు మాత్రం మినహాయింపులు ఉంటాయని పేర్కొంది.
మరోవైపు ఆతిథ్య దేశాల హెల్త్ ప్రొటోకాల్స్ పాటించాలని తమ దేశ పౌరులకు సూచించింది యూఏఈ. అదే టైంలో వేరే దేశాల్లో వైరస్ బారినపడి కోలుకున్న తమ దేశ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా తిరిగి స్వదేశాలకు రావడానికి వెసులుబాటు కల్పించింది కూడా.
చదవండి: కేంద్ర క్యాబినేట్ విస్తరణ.. మాజీ సీఎంకు చోటు!
Comments
Please login to add a commentAdd a comment