
వాషింగ్టన్: కోవిడ్ కట్టడి చేసే విషయమై బైడెన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బ్రెజిల్, ఐర్లాండ్, యూకేలతో సహా 26 ఇతర యూరోపియన్ దేశల నుంచి వచ్చే అమెరికా యేతర పౌరుల ప్రయాణాలపై మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నట్టు అమెరికా వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌పై ఆందోళనలు నెలకొనడంతో ఆంక్షల జాబితాలో దక్షిణాఫ్రికాని కూడా చర్చనున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష స్థానాన్ని వీడే చివరి రోజుల్లో మంగళవారం నుంచి ట్రావెల్ ఆంక్షలను సడలిస్తున్నట్టు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను తిప్పికొట్టిన అమెరికా నూతన అ«ధ్యక్షుడు బైడెన్, తిరిగి ప్రయాణ ఆంక్షలను విధించేందుకు సిద్ధమౌతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment