మాలె: గాజాపై చేస్తున్న దాడులను వ్యతిరేస్తూ.. నిరసగా ఇజ్రాయెల్‌పై ద్వీప దేశం మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశానికి రావడాన్ని నిషేధించింది. ఆదివారం నిర్వహించిన ‘పాలస్తీనాకు సంఘీభావం’ ర్యాలీలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రకటించారు.
ఇజ్రాయెల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులు ఇజ్రాయెల్‌కు రావడాన్ని నిషేధిస్తున్నామని అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. అయితే దీనికి సంబంధించిన చట్టపరమైన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. పాలస్తీనాకు మాల్దీవుల సంఘీభావం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని మొయిజ్జు ప్రకటించారు. ఇక.. గతంలో 1990లో ఇజ్రాయెల్ పౌరులపై విధించిన నిషేధాజ్ఞలు 2010లో ఎత్తివేసిన విషయం తెలిసిందే.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంలో మాల్దీవులు ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆ దేశ పౌరులపై నిషేధం విధించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో అధ్యక్షుడు మొయిజ్జు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధంపై ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పందించారు. ఇజ్రాయెల్ పౌరులను మాల్దీవులకు వెళ్లవద్దని సూచించారు. అక్కడ ఏమైనా జరిగితే సాయం చేయటం కష్టమవుతుంది. అందుకే ఇజ్రాయెల్‌లోనే ఉండాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment