వైట్‌హౌస్‌ను వీడాక తొలిసారి ట్రంప్‌పై ఒబామా..! | barack Obama attacks Trump, he says fundamentally disagrees with travel ban | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ను వీడాక తొలిసారి ట్రంప్‌పై ఒబామా..!

Published Tue, Jan 31 2017 9:17 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

వైట్‌హౌస్‌ను వీడాక తొలిసారి ట్రంప్‌పై ఒబామా..! - Sakshi

వైట్‌హౌస్‌ను వీడాక తొలిసారి ట్రంప్‌పై ఒబామా..!

వైట్‌హౌస్‌ను వీడిన పదిరోజుల తర్వాత తొలిసారి మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రాజకీయ అంశంపై స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీచేసిన ట్రావెల్‌ నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు ఆయన మద్దతు పలికారు. 'దేశవ్యాప్తంగా ప్రజలు చేపడుతున్న ఉద్యమంతో ఒబామా కదిలిపోయారు' అని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

'ఒకచోట గుమిగూడి.. ఎన్నికైన నేతలకు తమ గళం వినిపించేందుకు పౌరులు తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకుంటున్నారు. అమెరికా విలువలు ప్రమాదంలో పడినప్పుడు పౌరుల కర్తవ్యం ఇది' అని పేర్కొన్నారు. సిరియా, ఇరాక్‌ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ ఆదేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ఈ అంశంపై ఆయన స్పందించారు.

మతం, విశ్వాసం ఆధారంగా వ్యక్తులపై వివక్ష చూపడాన్ని సైద్ధాంతికంగా ఒబామా ఏకీభవించడం లేదని, ఆయన విదేశాంగ విధాన నిర్ణయాలు కూడా ఇదే విషయాన్ని చాటుతాయని ఆయన కార్యాలయం పేర్కొంది. ముస్లింలపై నిషేధం విషయంలో తాను కూడా ఒబామా విధానాలనే అనుసరిస్తున్నా అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ఆయన కార్యాలయం ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.  '2011లో అధ్యక్షుడు ఒబామా అనుసరించిన విధానాలే నేను కూడా అనుసరిస్తున్నా. 2011లో ఇరాక్‌ నుంచి వచ్చే శరణార్థులపై ఒబామా నిషేధం విధించారు' అని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement